ఐశ్వర్యపై అభిషేక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇకనైనా విడాకుల రూమర్స్ కు చెక్ పడినట్టేనా?

Abhishek Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్. తన తండ్రి స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్నా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్. ఈ క్రమంలోని బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ని పెళ్లి చేసుకొని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య అండ్ అభిషేక్. అయితే గత కొంతకాలంగా ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ పుకార్లపై అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్ లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే పాప పుట్టింది. గత 16 ఏండ్లుగా వీరి కాపురం బాగానే సాగింది. కానీ, గత కొన్ని నెలలుగా బాలీవుడ్ బిగ్ అమితాబ్ కుటుంబంలో విడాకుల అలజడులు రేగుతున్నాయి. అభిషేక్- ఐశ్వర్యారాయ్ మధ్య విభేదాలు వచ్చాయని వారిద్దరూ విడాకులకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ పై అభిషేక్ బచ్చన్ గాని అమితాబచ్చన్ గాని ఐశ్వర్యరాయ్ గాని ఎవరు స్పందించకపోవడంతో బచ్చన్ ఫ్యాన్స్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Abhishek Bachchan Talked About Relationship With Aishwarya Rai

ఈ క్రమంలో ఐశ్వర్యారాయ్ ఏ ఈవెంట్ కి వెళ్ళినా తన కూతురు ఆరాధ్యతో కలిసి వెళుతుంది. కానీ, బచ్చన్ ఫ్యామిలీతో మాత్రం కనిపించడం లేదు. మెయిన్ గా అంబానీ వారి ఇంటి పెళ్లిలో ఈ రూమర్స్ కు బలం చేకూర్చేలా.. ఐశ్వర్య తన కుటుంబంతో కాకుండా సింగిల్ గా ఆ పార్టీకి అటెండ్ అయింది. దీంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. పైగా అభిషేక్ బచ్చన్ మాజీ లవర్ నటి రేఖతో మాట్లాడడం కూడా కాంట్రవర్సీగా మారింది.

మరోవైపు.. ఐశ్వర్యాకు ఓ డాక్టర్ తో ఎఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా మరో బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో సన్నిహితంగా ఉన్నారని, వారిద్దరు రిలేషన్ లో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ కారణంతో ఐశ్వర్య కు అభిషేకం విడాకులు ఇస్తున్నాడని ప్రచారం జోరుగా జరిగింది. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన విడాకుల రూమర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Abhishek Bachchan Talked About Relationship With Aishwarya Rai
తాజాగా హీరో అభిషేక్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ విడాకుల రూమర్స్ పై స్పందించారు. ఐశ్వర్యతో 15 ఏండ్ల మ్యారేజ్ లైఫ్ లో మీ ప్రయాణం ఎలా సాగితుంది? అని ప్రశ్నించగా.. అభిషేక్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్య చాలా మంచి భార్య. అసాధారణమైనది మహిళ. ఆమె ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంటుంది. మేమిద్దరం ఒకే ఫీల్డ్‌కి చెందిన వారు కావడం అదోక ఫ్లస్ పాయింట్.. అందుకే ఐశ్వర్య అన్నీ విషయాలను సులభంగా అర్థం చేసుకుంటుంది' అని అభిషేక్ చెప్పాడు.

అలాగే.. ఐశ్వర్య తన కంటే ఎక్కువ కాలం ఈ ఇండస్ట్రీలో ఉంది, కాబట్టి ఆమెకు ప్రతిదీ అర్థం అవుతుంది. తమపై నెగిటివ్ కామెంట్స్ వచ్చిన ఏ రోజు కూడా వాటిని పట్టించుకోదు. తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఊరుకోదు. అంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. విడాకులు తీసుకోబోతున్నారని ఎన్ని రూమర్స్ వినిపించినా.. తాము మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామని, ఆ రూమార్స్ చెక్ పెట్టారు అభిషేక్ బచ్చన్. ఇకనైనా ఈ జంటపై రూమార్స్ క్రియేట్ చేయడం మానుకుంటారో .. లేదో.. వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X