Just In
- 1 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 22 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిషేక్ బచ్చన్ సర్‌ప్రైజ్ ట్వీట్.. ఐశ్వర్యారాయ్ మెడకు.. నెటిజన్ల దిమ్మతిరిగే కామెంట్స్
అసలే సోషల్ మీడియాలో కాలంలో ఉన్నాం మనమంతా. ఎవరి నోటికి ఎంతొస్తే అంతా అనేస్తూ ఉంటారు. పైగా సెలెబ్రిటీలు అనే అలుసు ఉండనే ఉంది. వారిని ఎవ్వరైనా ఏదైనా అనేయొచ్చనే అధికారం ఉన్నట్లు నెటిజన్లు రెచ్చిపోతుంటారు. అయితే కొందరు సరదాగా అంటే మరి కొందరు మాత్రం కావాలనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడతారు. తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్‌పై భిన్న రకాలు కామెంట్స్ చేశారు నెటిజన్లు.

సర్‌ప్రైజ్ అంటూ ట్వీట్..
హే గాయ్స్.. మీ అందరి కోసం సర్‌ప్రైజ్.. చూస్తూనే ఉండండి.. అంటూ ట్వీట్ చేశాడు. ఇక అంతే నెటిజన్లు తమ తెలివికి, చమత్కారానికి, కొంటెదనానికి, ప్రతిభకు ఇలా అన్నింటికి పదును పెట్టారు. అందులో కొందరు బచ్చన్ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలను కూడా టచ్ చేశారు.

ఐశ్వర్యారాయ్ ప్రెగ్నెన్సీ..
సర్‌ప్రైజ్ అంటూ అభిషేక్ బచ్చన్ చేసిన ఈ ట్వీట్‌కు నిజంగానే సర్‌ప్రైజింగ్ రిప్లైలు వచ్చాయి. కొన్ని రాజకీయ నేపథ్యంలో తగలగా, మరి కొన్ని రాబోయే ప్రాజెక్ట్‌ల విషయమై ఉంటుందని కామెంట్లు చేయగా.. మరి కొందరు ఐశ్వర్యారాయ్ ప్రెగ్నెన్సీపై పడిపోయారు.

కామన్‌సెన్స్ ఉపయోగించండి..
మీరు మరోసారి తండ్రి కాబోతోన్నారా? ఐశ్వర్యా తల్లి కాబోతోందా? జూనియర్ బచ్చన్ రాబోతోన్నాడా? అంటూ ఇలా పలు రకాల కామెంట్స్ చేస్తు వచ్చారు. మధ్యలో ఓ నెటిజన్ ఫైర్ అవుతూ..ఐశ్వర్యకు ఇప్పుడు 46.. కాస్త కామన్‌సెన్స్ పెట్టి ఆలోచించండి అంటూ ట్వీట్ చేశాడు.
|
జుంద్ టీజర్..
అయితే అభిషేక్ పెట్టిన ఆ సర్‌ప్రైజ్ ట్వీట్.. అమితాబ్ నటించిన జుంద్ టీజర్ గురించి అని కొందరు కనిపెట్టారు. అందులో కొంతమందికి అభిషేక్ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే జుంద్ టీజర్‌కూ పోస్ట్ చేశాడు. కానీ ఆ కొద్ది సమయంలోనే నెటిజన్ల కామెంట్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.