ప్రభాస్ 'ఛత్రపతి' సినిమా రీమేక్.. కోరిక బయట పెట్టిన స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో తన మనసులో మాట బయటపెట్టాడు. తాను తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తుంటానని తెలిపాడు. ఇప్పుడు షూటింగ్ తో బిజీ కావడం వలన తెలుగు చిత్రాలు చూడడం బాగా తగ్గించా. కానీ ఎప్పుడు ఏ సినిమా విడుదలవుతుంది వంటి అంశాలు ఫాలో అవుతుంటా అని అభిషేక్ తెలిపాడు.

తెలుగు సినిమా రీమేక్ అవకాశం వస్తే ఏ చిత్రాన్ని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు అభిషేక్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ ఛత్రపతి సినిమాని ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే అందులో యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆ సినిమా రీమేక్ చేసే అవకాశం వస్తే వదులుకోను అని అభిషేక్ తెలిపాడు.

త్వరలో అభిషేక్, ఐశ్వర్యరాయ్ కలసి గులాబ్ జామున్ అనే చిత్రాల్లో నటించనున్నారు. చాలా ఏళ్ల తరువాత అభిషేక్, ఐశ్వర్య కలసి నటించబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











