ఒంటరితనంపై అభిషేక్ అలాంటి పోస్ట్.. ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై హింట్ ఇచ్చేశాడా?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా విడాకుల ప్రస్తావనే కనిపిస్తోంది. తమిళ నటుడు జయం రవి అతని భార్య ఆర్తి రవి మధ్య విడాకుల వ్యవహారం సినిమాను తలపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ - ధనశ్రీల గొడవ పెద్ద రచ్చకు దారి తీసింది. అసలు ఈ ఫ్యామిలీ విషయాలలో తొలుత తెరపైకి వచ్చిన జంట ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌లదే. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ నేటికీ గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అభిషేక్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఐష్‌తో 18 ఏళ్ల వైవాహి బంధం
ధూమ్-2 సినిమా సమయంలో ఐశ్వర్యరాయ్ - అభిషేక్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటికీ వీరిద్దరూ పలువురితో ప్రేమాయణాలు సాగించారు. ఐష్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ కాగా.. అంతర్జాతీయంగానూ ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. అమితాబ్ బచ్చన్ కుమారుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిషేక్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. తండ్రి స్థాయిలో అభిషేక్ మెప్పించలేకపోయారు. ఐష్- అభిషేక్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ 2007లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి కుమార్తె ఆరాధ్య సంతానం.

Abhishek Bachchan s post on loneliness spark divorce rumours with Aishwarya Rai Bachchan

నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ డేటింగ్?
పెళ్లి, పిల్లల తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఐశ్వర్య.. అనంతరం తన ఇమేజ్, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ రీ ఎంట్రీలోనూ కుమ్మేస్తున్నారు. ఆమె డేట్స్ కోసం ఇప్పటికీ టాలీవుడ్ టూ బాలీవుడ్ నిర్మాతలు క్యూకడుతూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతా సాఫీగా సాగుతున్న దశలో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్- అభిషేక్‌లు విడిపోతున్నారంటూ గతేడాది విస్త్రతంగా కథనాలు వచ్చాయి. నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ రిలేషన్‌లో ఉన్నారని అందుకే ఐష్‌తో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నాడని గాసిప్స్ వైరల్ అయ్యాయి.

అంబానీ పెళ్లిలో ఒంటరిగా ఐశ్వర్య
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లికి తారా లోకమంతా తరలి వచ్చి సందడి చేసింది. అయితే ఐశ్వర్య మాత్రం అభిషేక్‌ లేకుండా కూతురితో కలిసి ఈ వేడుకకు రావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి విడాకుల వార్తలకు ఈ ఘటన బలాన్ని చేకూర్చింది. ఇదొక్కటే కాదు బాలీవుడ్‌లో జరిగిన కొన్ని కార్యక్రమాలకు బచ్చన్ ఫ్యామిలీ విడిగా రావడం.. ఆరాధ్యతోనే ఐశ్వర్య కనిపిస్తూ ఉండటంతో విడాకులు ఖాయమని అనుకున్నారు. అలాగే ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు అభిషేక్ దూరంగా ఉండటంతో బచ్చన్ ఫ్యామిలీలో ఏదో జరగబోతోందని అంతా అనుకున్నారు.

ఒంటరితనంపై అభిషేక్ పోస్ట్
అయితే బచ్చన్ ఫ్యామిలీ, అభిషేక్, ఐశ్వర్యలు ఈ కథనాలను ఖండించారు. పలు ఫ్యామిలీ ఈవెంట్స్‌కు ఐష్- అభిషేక్‌లు జంటగా వెళ్తూ అందరి నోళ్లు మూయించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భారతీయ స్త్రీలు ఎంతో గౌరవంగా, ఐదోతనానికి చిహ్నంగా భావించే సిందూరాన్ని పాపిట్లో ధరించి కనిపించారు ఐష్. దీంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లయ్యింది. తాజాగా అభిషేక్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నాకిష్టమైన వారి కోసం అన్నీ ఇచ్చేశానని.. నాకు ఒంటరిగా ఉండాలని ఉందని, నా కోసం కొంత టైం కావాలంటూ రాసుకొచ్చాడు. జనానికి దూరంగా ఒంటరిగా నన్ను నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని అభిషేక్ తెలిపాడు. దీంతో ఐష్ - అభిషేక్‌ల మధ్య ముగిసిపోయిందనుకున్న విడాకుల టాపిక్‌ను మరోసారి జూనియర్ బచ్చన్ కెలికినట్లయ్యింది. ఈ పోస్ట్‌పై సినీ వర్గాలు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X