దాదాపు 50 నంబర్లు మార్చాడు... అతను ఫోన్ చేసే వరకు చేయకూడదనుకున్నా.. సుశాంత్‌పై డైరెక్టర్ కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ బంధుప్రీతి, కొందరు పెద్దలే కారణమని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్ తీరును తప్పుబట్టారు. సుశాంత్ మరణానికి కారణం కరణ్ జోహర్ లాంటి సినీ పెద్దలేనని ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. గతవారం నుంచి బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

నెపోటిజంపై ఫైర్..
బాలీవుడ్‌లో పేరుకు పోయిన నెపోటిజంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సుశాంత్‌కు అవకాశాలు రాకుండా చేశారని, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయన్ను బాయ్ కాట్ చేశారని ఆరోపించారు. ఇక ఇదే విషయమై కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. సుశాంత్‌ను వెండితెరకు కాయి పో చే సినిమాతో పరిచయం చేసిన అభిషేక్ కపూర్ తాజాగా మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించాడు.

చిన్న పిల్లాడిని కోల్పోయినట్టుంది..
సుశాంత్ మరణంపై అభిషేక్ కపూర్ స్పందిస్తూ.. అతనో రత్నం లాంటివాడు, అతడ్ని కోల్పోవడమంటే చిన్న పిల్లాడిని కోల్పోయినట్టుందని తెలిపాడు. సుశాంత్‌తో ఉన్న అనుబంధం, అతనితో జరిగిన కొన్ని ఘటనల గురించి అభిషేక్ వివరించాడు. కేదార్‌నాథ్ సినిమా విషయంలో జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చాడు.

దాదాపు 50 నంబర్లు..
కేదార్‌నాథ్ సినిమా షూటింగ్ రోజుల్లో సుశాంత్ దాదాపు 50 నంబర్లు మార్చి ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా సమయంలో సారా అలీఖాన్‌నే అందరూ సెంటర్ చేసేవారని, ఈ విషయంలో సుశాంత్ హర్ట్ అయి ఉంటాడని చెప్పుకొచ్చాడు. దాదాపు అతనితో ఏడాదిన్నర పాటు మాట్లాడకుండా ఉన్నానని తెలిపాడు.

ఎన్నో మెసెజ్‌లు చేశాను..
సుశాంత్‌కు ఎన్నో మెసెజ్‌లు చేశాను, ఎన్నో సార్లు కాల్ కూడా చేశాను కానీ ఏ ఒక్క దానికి రిప్లై ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అయితే అతను బాధల్లో ఉన్నాడో లేదా బిజీగా ఉండి అలా చేశాడో కచ్చితంగా తెలియదన్నాడు. మనం సూపర్ హిట్ సినిమాను తీశామని, సెలెబ్రేట్ చేసుకోవాలని చెప్పానని అన్నాడు.
Recommended Video

తాను చేసే వరకు చేయకూడదని..
కానీ సుశాంత్ స్పందించలేదని, బర్త్ డే రోజున కూడా రియాక్ట్ కాలేదని తెలిపాడు. అప్పుడు తనకు తానే సర్ది చెప్పుకున్నానని.. అతను బాగా లేడు కానీ మన హద్దులు దాట కూడదని అనుకున్నట్టు తెలిపాడు. ఎంత క్లోజ్‌గా ఉన్నా కొన్ని హద్దులుంటాయి కదా.. అని అలా ఊరుకున్నానని తెలిపాడు. ఆయన కాల్ చేసే అంత వరకు చేయకూడదని అనుకున్నాను.. కానీ అతను ఎప్పుడూ కాల్ చేయలేదని తెలిపాడు.


Click it and Unblock the Notifications











