సుశాంత్ ఫ్రెండ్‌పై ఆరోపణలు.. బీజేపీతో లింకులు ఉన్నాయంటూ ఫైర్!

సుశాంత్ సింగ్ కేసులో రోజుకో కొత్త కోణం బయటకు వస్తుంది. రోజుకో రకమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల మధ్య ఈ కేసు చిచ్చు పెట్టినట్టైంది. అంతేకాకుండా ఇది రాజకీయాంగానూ బాగా వేడెక్కిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేస్తోంది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులంతా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్‌ అయితే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి నానా రచ్చ చేశాడు.

పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన సందీప్.. ఇంటి బయటే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం చేద్దామని చూశాడు. అయితే నేడు ఆ వ్యక్తిపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ స్నేహితుడైన సందీప్ సింగ్‌కు బీజేపీతో లింకులున్నాయని ఆరోపిస్తున్నారు. అతను మహారాష్ట్రలో బీజేపీ కార్యాలయానికి 53 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించాడు.

Abhishek Manu Singhvi Allegations On Sandeep Singh In Sushant Case

అంతే కాకుండా గతేడాది వచ్చిన మోదీ బయోపిక్ చిత్ర నిర్మాతల్లో సందీప్ ఒకడని గుర్తు చేశాడు. అంతేకాకుండా అతని నిర్మాణ కంపెనీ గ్లోబర్ స్టూడియోతో గుజరాత్ సమ్మిట్‌లో దాదాపు 178 కోట్ల ఒప్పందం జరిగిందని కూడా బయట పెట్టాడు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన మారిషస్ ట్రిప్‌కి కూడా వెళ్లాడని, అక్కడ అతనిపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయని, బీజేపీ, సందీప్ సింగ్ అసలు స్వరూపాలను అభిషేక్ మను సింఘ్వీ ఎండగట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X