పాకిస్థాన్ జెండాను కౌగిలించుకొన్న రాఖీ సావంత్.. కాల్చి పారేస్తానని వార్నింగ్
వివాదాల్లో తలదూర్చడమనేది బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. వివాదాల జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవడం తరుచుగా చేస్తూనే ఉంటుంటారు. కొన్నిసార్లు ఆమె ప్రయేయం లేకుండానే వివాదాల్లో కూరుకుపోతుంటారు. కొన్నిసార్లు తనంతట తానే వివాదాలను ఆహ్వానిస్తుంటారు. తాజాగా పాకిస్థాన్ జెండాను కౌగిలించుకొని వివాదాన్ని ఆహ్వానించారు. వివారాల్లోకి వెళితే..

పాకిస్థానీ యువతిగా రాఖీ సావంత్
శృంగార తార రాఖీ సావంత్ ధారా 370లో పాకిస్థానీ యువతిగా నటిస్తున్నది. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. దాంతో ఆమె చేసిన తీరుకు నెటిజన్లు మండిపడ్డుతున్నారు.

పాకిస్థాన్ జెండాను కప్పుకొని
పాకిస్థాన్ జెండాను చేతపట్టుకొన్నారు. ఆపై దానిని ఒంటి నిండా కప్పుకొని ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఐ లవ్ మై ఇండియా.. ధారా 370లో నా ఓ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాను అని కామెంట్ చేశారు. రాఖీ చర్యతో నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో పెట్టి
అంతేకాకుండా రాఖీ సావంత్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓ వీడియోను షేర్ చేశారు. పాకిస్థాన్‌లో అందరూ చెడ్డవారు కాదు. ప్రతీ దేశంలో ఎవరో ఒక్కరు చెడ్డవాళ్లు సొసైటికి చెడు చేస్తుంటారు. పాకిస్థాన్‌లో కూడా అలాంటి వాళ్లు ఉంటారు అని రాఖీ సావంత్ అన్నారు.

కాల్చిపారేస్తానని వార్నింగ్
దేశంలోని ఎంతో మందిని పొట్టనపెట్టుకొన్న పాకిస్థానీయులను సమర్ధిస్తావా? అంటూ నెటిజన్లు చెలరేగిపోయారు. రాఖీ సావంత్ నీ వేషాలు ఎంత చెండాలంగా ఉన్నాయంటే.. ఒకవేళ నేను సైన్యంలో ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కాల్చిపడేస్తాను అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











