twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కేసు: అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రముఖ నటుడు, పోలీసుల గాలింపు!

    |

    #మీటూ ఉద్యమం బలపడిన తర్వాత బాలీవుడ్లో పలువురు ప్రముఖుల పేర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నటుడు అలోక్ నాథ్ మీద రేప్ కేసు నమోదైంది. అయితే ఈ కేసు నమోదైన దగ్గర నుంచి అలోక్ నాథ్ ఎవరికీ కనిపించకుండా పోవడం చర్చనీయాంశం అయింది.

    అలోక్ నాథ్ తనపై 19 ఏళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డట్లు రైటర్, ప్రొడ్యూసర్ వింటా నందా ఆరోపించడంతో పాటు కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

    ఎక్కడికి వెళ్లినట్లు?

    ఎక్కడికి వెళ్లినట్లు?

    ఆంగ్లపత్రిక కథనం ప్రకారం... కేసు నమోదైన తర్వాత నటుడికి సమన్లు అందించడానికి పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. గత రెండు వారాలుగా ఆయన్ను కలిసి నోటీసులు అదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ అందుబాటులోకి రావడం లేదట.

    అతడి వెర్షన్ కూడా కీలకం

    అతడి వెర్షన్ కూడా కీలకం

    19 ఏళ్ల క్రితం సంఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసు ముందుకు సాగాలంటే అలోక్ నాథ్ చెప్పే వెర్షన్ కూడా ఎంతో ముఖ్యమని, అతడి వాంగ్మూలం తీసుకుంటే తప్ప విచారణ వేగవంతం చేయలేమని, కానీ అతడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు.

    ‘తారా' టెలి సీరియల్

    ‘తారా' టెలి సీరియల్

    90ల్లో వచ్చిన ‘తారా' అనే టెలీ సీరియల్‌కు వింటా నందా రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో అలోక్ నాథ్ లీడ్ రోల్ పోషించారు. ఆ సమయంలో అలోక్ నాథ్ ఇంట్లో జరిగిన పార్టీకి వెళ్లినపుడు కూల్ డ్రింకులో ఏదో కలిపి ఇచ్చారని, దాంతో తాను అపస్మాకర స్థితిలోకి వెళ్లానని... ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్లి తన నివాసంలోనే అత్యాచారం చేసినట్లు వింటా నందా ఆరోపించారు.

    ఆరోపణలు ఖండించిన లాయర్

    ఆరోపణలు ఖండించిన లాయర్

    అలోక్ నాథ్ మీద వచ్చిన ఆరోపణలను అతడి లాయర్ అశోక్ ఇప్పటికే ఖండించారు. వింటా నందా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సిని అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నోటీసులు జారీ చేయగా... ఆ ఆరోపణల్లో నిజం లేదని లాయర్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    English summary
    According to Mid-Day, Alok Nath has gone missing nearly two weeks after the Mumbai Police booked the veteran actor for rape on the complaint filed by after writer-producer Vinta Nanda in October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X