అర్జున్ రాంపాల్‌కు మళ్లీ సమన్లు.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ మరోసారి పంజా
బాలీవుడ్‌తో సంబంధమున్న డ్రగ్స్ రాకెట్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి పంజా విసిరింది. ఇప్పటికే ఓసారి అర్జున్ రాంపాల్‌ను విచారించిన అధికారులు మరోసారి ఆయనకు సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ సంబంధమున్న కేసులో విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.
గతంలో నవంబర్ 8 తేదిన అర్జున్ రాంపాల్ ఇంటిలో మెరుపుదాడులు నిర్వహించారు. దాడుల అనంతరం ఆయన ఇంటి నుంచి కొంత మేరకు డ్రగ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు. అదే రోజున అర్జున్ రాంపాల్ ప్రియురాలు గ్యాబ్రిల్లా డెమిట్రియాడెస్‌ను ఆరు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన అర్జున్ రాంపాల్‌ను విచారించారు.

అర్జున్ రాంపాల్ ఇంటిపై దాడులు నిర్వహించిన తర్వాత తన స్నేహితుడు పాల్ బార్టెల్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పాల్‌ను విచారిస్తున్న క్రమంలో మళ్లీ అర్జున్ రాంపాల్‌కు సమన్లు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











