గ్యాంబ్లింగ్ రాకెట్: ప్రముఖ నటి భాగ్యశ్రీ భర్త అరెస్ట్
తెలుగులో రాజశేఖర్‌తో ఓంకారం(1997), బాలయ్యతో కలిసి రాణా(1998) చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ హిందీలో 'మైనే ప్యార్ కియా'తో పాపులర్ అయ్యారు. తాజాగా భాగ్యశ్రీ పేరు మీడియాలో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం ఆమె భర్త గ్యాంబ్లింగ్ రాకెట్లో అరెస్ట్ కావడమే.
భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసాని గ్యాంబ్లింగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హిమాలయను మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ముంబైలో భారీ ఎత్తున జరిగే జూదం వెనక హిమాలయ కీలక వ్యక్తిగా ఉన్నారట.

బాలీవుడ్ నటుడైన హిమాలయ... తర్వత నిర్మాతగా మారారు. ఈజీ మనీకోసం అతడు కొంతకాలంగా మన దేశంలో నిషేధించబడిన గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల్లో గ్యాబ్లింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా వేసి అతడిని అరెస్ట్ చేశారు.
హిమాలయను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని లోకల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతడికి బెయిల్ మంజూరైంది. దాసాని 1992లో పాయల్ అనే మూవీ ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











