డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి కుమారుడు అరెస్ట్.. వాట్సాప్ ఛాటింగ్‌తో.. !

బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కార్యక్రమాలపై నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం కొరడా ఝులిపిస్తున్నది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ కుమారుడు ధృవ్ తాహిల్‌ను ముంబై పోలీసు విభాగానికి చెందిన యాంటీ నార్కోటిక్ సెల్ విభాగం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే....

నటుడిగా, మోడల్‌గా రాణిస్తూ..

నటుడిగా, మోడల్‌గా రాణిస్తూ..

ధ‌ృవ్ తాహిల్ బాలీవుడ్‌లో వర్థమాన నటుడిగా, మోడల్‌గా గుర్తింపు పొందారు. సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ధృవ్ తాహిల్‌ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ కొనుగోలు, వినియోగం చేశారనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆయనను గురువారం ఏప్రిల్ 6వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

డ్రగ్ డీలర్‌తో సంప్రదింపులు

డ్రగ్ డీలర్‌తో సంప్రదింపులు

బాలీవుడ్ పత్రికల కథనం ప్రకారం.. కొద్దికాలంగా డ్రగ్ డీలర్ ముజమ్మాల్ రెహ్మన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొన్నారు. అతడి వద్ద నుంచి డగ్స్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ముజామ్మిల్‌ను ఏప్రిల్ 20వ తేదీన అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 35 గ్రాముల మెపెడ్రోన్ సీజ్ చేశారు. అతడిని విచారించగా ధృవ్ తాహిల్ పేరు బయటకు వచ్చింది అని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛాటింగ్‌తో

వాట్సాప్ ఛాటింగ్‌తో

డ్రగ్ డీలర్‌ను విచారించిన క్రమంలో అతడి సెల్‌ఫోన్‌ నుంచి డేటాను సేకరించగా, వాట్సాప్ చాట్స్‌లో ధృవ్ పేరు బయటకు వచ్చింది. ముజామిల్ షేక్ నుంచి పలుమార్లు డ్రగ్స్ తీసుకొన్నాడనే విషయం వాట్సాప్ ఛాట్‌లో స్పష్టమైంది. ఆ నేపథ్యంలో ధృవ్‌ను అరెస్ట్ చేశారు అని మీడియా కథనాలు వెల్లడించాయి.

Recommended Video

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Filmibeat Telugu
2019 నుంచి సంబంధాలు

2019 నుంచి సంబంధాలు

ధృవ్‌ను అరెస్ట్ చేయడానికి ముందు డ్రగ్ డీలర్‌ను విచారించగా తన బ్యాంకు అకౌంట్‌లో డబ్బు జమ చేశారనే విషయాన్ని వెల్లడించారు. ఆ ట్రాన్సక్షన్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు వెరిఫై చేసుకోగా ధృవ్‌కు డ్రగ్ డీలర్‌తో 2019 మార్చి నుంచి సంబంధాలు ఉన్నట్టు రుజువైంది. దాంతో ఆయనను అరెస్ట్ ఛేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X