twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dilip Kumar : భారీ ఎస్కార్ట్ తో ఇంటికి పార్ధివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు, దిలీప్ కుమార్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహమ్మద్ యూసుఫ్ ఖాన్, బుధవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబం, సహాయకులు తెలిపారు. ఇక ఆయన మృతదేహాన్ని ఇంటికి భారీ సెక్యూరిటీ మధ్య తరలించారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు

    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..

    హై సెక్యూరిటీ మధ్య

    హై సెక్యూరిటీ మధ్య

    బాలీవుడ్ లెజెండ‌రీ నటుడు దిలీప్ కుమార్ ఈ ఉద‌యం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు ముంబైలోని జుహు శ్మ‌శాన‌ వాటిక‌లో నిర్వ‌హించ‌నున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన భౌతిక కాయాన్ని హై సెక్యూరిటీ మధ్య ఇంటికి తరలించారు. నిజానికి చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దిలీప్ కుమార్‌.. ఈ ఉద‌యం ఏడున్నర గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు.

    అంత్యక్రియలు ఎప్పుడంటే

    అంత్యక్రియలు ఎప్పుడంటే

    ఎంతగానో ఆయనని ప్రేమించే ఆయ‌న భార్య సైరా బాను చివ‌రి క్ష‌ణాల్లో సైతం ఆయ‌న‌తోనే ఉన్నారు. ఇక దిలీప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజ‌ల్ ఫ‌రూకీ దిలీప్ ట్విట‌ర్ అకౌంట్ నుంచి ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌తోపాటు అంత్య‌క్రియ‌ల స‌మాచారాన్ని కూడా వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో శాంటాక్రూజ్ వెస్ట్‌లోని జుహు ముస్లిం శ్మశానవాటికలో జరిగే అవకాశం ఉందని ఫరూకి చెప్పారు.

    బాగున్నరని అనుకునేలోపు

    బాగున్నరని అనుకునేలోపు

    వయోభారంతో ఏర్పడిన అనేక అనారోగ్య సమస్యల కారణంగా దిలీప్ కుమార్ జూన్ 30న హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఇక అప్పుడు కాస్త ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం గురించి అతని భార్య సైరా బాను ఖాన్ ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

    చివ‌రి సినిమా

    చివ‌రి సినిమా

    మ‌ధుమ‌తి, దేవ‌దాస్‌, మొఘ‌ల్ ఏ ఆజ‌మ్‌, గంగా జ‌మునా, రామ్ ఔర్ శ్యామ్‌, క‌ర్మ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో దిలీప్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. అయితే అందాజ్‌, బాబుల్‌, దీద‌ర్‌, జోగ‌న్ లాంటి ప్రేమ విషాద చిత్రాల్లో ఆయ‌న ఎక్కువగా నటించడం, విషాదంతో జనాన్ని ఏడిపించడంతో ఆయ‌న‌కు ట్రాజిడీ కింగ్ అన్న పేరు వ‌చ్చింది. ఇక 1998లో రిలీజైన ఖిలా ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా.

    సంతాపం

    సంతాపం

    ఇక అయన మృతితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సహా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే లోకసభ స్పీకర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరి, రాజ్‌నాథ్ సింగ్‌, ప్రకాష్ జవదేకర్‌తో పాటు సినిమా పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, వెంకటేష్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ సంతాపం తెలియజేశారు.

    English summary
    Late Dilip Kumar's wife and veteran actor Saira Banu escorted from hospital as legendary actor's mortal remains reach home. final rites to take place today evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X