For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలీవుడ్‌లో మరో బ్రేకప్... విడిపోయిన స్టార్ హీరో దంపతులు.. అమీర్‌ఖాన్ దారిలోనే మేనల్లుడు!

|

బాలీవుడ్‌లో మరో స్టార్ జంట విడిపోవడానికి సిద్ధపడుతున్నది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు, హీరో ఇమ్రాన్ ఖాన్, అవంతి మాలిక్ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం బాలీవుడ్ వర్గాలను షాక్ గురి చేసింది. చక్కగా సాగుతుందనుకొన్న కాపురం పెటాకులు కావడంపై రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. వీరిద్దరి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో వీరి ఐదేళ్ల కూతురు పరిస్థితి గందరగోళంలో పడింది. ఇమ్రాన్ ఖాన్ విడాకులు తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటంటే..

పెళ్లికి ముందు ఎనిమిదేళ్లు డేటింగ్

హీరో ఇమ్రాన్ ఖాన్, అవంతిక మాలిక్ మధ్య మంచి సన్నిహితమైన రిలేషన్స్ ఉండేది. పెళ్లికి ముందు వారిద్దరూ ఎనిమిది సంవత్సరాలు డేటింగ్ చేశారు. డేటింగ్‌ను పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి వారి రిలేషన్‌ను మరో మెట్టు ఎక్కించారు. ఆ తర్వాత 2014 జూన్‌ 9 తేదీన ఇమారా అనే కూతురు జన్మించడంతో వారి దాంపత్య జీవితంలో పూర్తిస్థాయి సంతోషం నిండింది. నా జీవితానికి ఇమారా రూపంలో అవంతిక మంచి గిఫ్ట్ ఇచ్చారని ఓ సందర్బంలో అన్నారు.

వ్యక్తిగత విభేదాల కారణంగా

ఇలా ఇమ్రాన్ ఖాన్ దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఊహించిన విధంగా అవంతికతో వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. వారి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడానికి సన్నిహితులు, స్నేహితులు ప్రయత్నించారట. అయితే ఇటీవల కాలంలో వారి విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారట.

ఇమ్రాన్‌ ఖాన్‌కు భార్య గుడ్‌బై

ఇమ్రాన్‌ ఖాన్‌కు భార్య అవంతిక గుడ్‌బై

తాజాగా బాలీవుడ్ మీడియాలో అమీర్ ఖాన్, అవంతిక రిలేషన్‌పై అనేక వార్తలు వెలుగు చూశాయి. కొద్ది రోజలు క్రితం ఇమ్రాన్ ఇంటి నుంచి తన కూతురును తీసుకొని అవంతిక వెళ్లిపోయింది. వారిద్దరు ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నారు. ఆమె ఇప్పడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి జీవించే అవకాశం తక్కువే అని కథనాలలో పేర్కొన్నారు.

సినీ వర్గాలకు షాకిచ్చిన బ్రేకప్

ఇమ్రాన్ ఖాన్, అవంతిక బ్రేకప్ వార్తలు సినీ వర్గాలకు నమశక్యంగా లేవు. వారిద్దరి మధ్య విభేదాల కారణమేమిటో తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినా కుదరడం లేదు. వీరిద్దరూ మీడియాకు దూరంగా ఉంటున్నారు. గత కొద్దికాలంగా ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ తెరపైన కనిపించిన దాఖలాలు కూడా పెద్దగా కనిపించడం లేదు.

ఇమ్రాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే

ఇమ్రాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే, బాలనటుడిగా ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్ అనే చిత్రాలలో నటించాడు. ఆ చిత్రంలో చిన్నప్పటి అమీర్ ఖాన్‌గా మెప్పించాడు. ఆ తర్వాత జానే తు.. యా జానే నా అనే సినిమాతో హీరోగా మారాడు. చివరిగా 2015లో కట్టిబట్టి అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం మిషన్ మార్స్ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు.

English summary
Bollywood hero Imran Khan's marriage releations with Avanthika Malik come to end. They decided to break thier relations. Now, They had 5 years daughter Imara. Reports suggest that Avanthika left Imran khans residence long ago and living separately with her family.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more