twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోరాడి ఓడిన ఇర్ఫాన్.. క్యాన్సర్‌ను జయించలేక అనంతలోకాలకు.. చివరి చిత్రమిదే

    |

    బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. కోలన్ ఇన్ఫెక్షన్ (పెద్దపేగు సంబంధిత వ్యాధి)తో బాధపడుతూ ఆయన మంగళవారం రాత్రి మరణించారు. ఇటీవల అనారోగ్య బారిన పడటంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా చివరకు క్యాన్సర్ ఇర్ఫాన్ ఖాన్ కబళించి.. సినీ పరిశ్రమకు విషాదంలోకి నెట్టింది. అయినా ఆయన మృత్యువుతో అలుపెరగని పోరాటం చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా క్యాన్సర్ మహమ్మారితో పోరాడి అనంతలోకాలకు చేరుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    2018 నుంచి పోరాటం..

    2018 నుంచి పోరాటం..

    2018లో ఆయన క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయితే ఈ విషయం తెలిసి అభిమానులెంతో ఆందోళన చెందారు. తనకు క్యాన్సర్ సోకిందని, తాను చికిత్స తీసుకుంటున్నానని ఏమీ కాదని అభిమానులకు భరోసా ఇచ్చాడు. స్వయంగా తాను ఈ వార్తలపై స్పందిస్తూ అందరికీ మనోధైర్యాన్ని కల్పించాడు.

    Recommended Video

    Irrfan Khan Passes Away At 53 | 3 రోజుల క్రితమే తల్లి కూడా...!!
    లండన్‌లో చికిత్స..

    లండన్‌లో చికిత్స..

    క్యాన్సర్ సోకినా కూడా ఇర్ఫాన్ మనో నిబ్బరంతో ఉన్నారు. భార్య చేసే సేవలకు ముగ్దుడయ్యాడు. తన కోసమైనా బతకాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ చికిత్స కోసం లండన్‌ కూడా వెళ్లాడు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.

    క్యాన్సర్ ఉన్నా షూటింగ్‌లో..

    క్యాన్సర్ ఉన్నా షూటింగ్‌లో..

    క్యాన్సర్ బారిని పడినా ఇర్ఫాన్ ఖాన్ అంతకుముందు అగ్రిమెంట్ ప్రకారం అంగ్రేజ్ మీడియం షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ వీలును చూసుకుని ఎటువంటి ఇబ్బంధి కలగకుండానే చిత్రాన్ని పూర్తి చేశారు. విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నా.. లాక్ డౌన్ వల్ల థియేటర్ల నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

    ప్రమోషన్స్‌లో ఎమోషన్..

    ప్రమోషన్స్‌లో ఎమోషన్..

    మూవీ ప్రమోషన్స్ సమయంలో ఇర్ఫాన్ ఎమోషనల్ అయ్యారు. ‘నాకు ఈ సినిమా ఎంతో ముఖ్యం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఈ సినిమాను ప్రమోట్‌ చేద్దాం అనుకున్నా. కానీ నా శరీరంలో ఎంతో మంది అనవసరపు అతిథులు ఉన్నారు. అందుకే మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మళ్లీ నవ్విస్తుంది. ఇంకా ఎన్నెన్నో విషయాలు బోధిస్తుంది. ట్రైలర్‌ను ఎంజాయ్‌ చేయండి. నా కోసం ఎదురుచూడండి' అని ట్వీట్ చేశారు.

    శోకసంద్రంలో తారలు..

    శోకసంద్రంలో తారలు..

    ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త తెలుగు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేసున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ ప్రముఖులంతా ఇర్ఫాన్‌కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఎంతో శూన్యాన్ని మిగిల్చారంటూ బిగ్‌బీ అమితాబ్ ఆవేదన చెందారు.

    English summary
    Actor Irrfan Khan died with colon infection in mumbai: Director Shoojit Sircar tweeted that My dear friend Irfaan. You fought and fought and fought. I will always be proud of you.. we shall meet again.. condolences to Sutapa and Babil.. you too fought, Sutapa you gave everything possible in this fight. Peace and Om shanti. Irfaan Khan salute.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X