ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత.. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ..
విలక్షణ నటుడు, ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. కోలన్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ ఆయన మంగళవారం రాత్రి మరణించారు. ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇర్ఫాన్ మృతిని దర్శకుడు షుజిత్ ట్విట్టర్‌లో ధృవీకరిస్తూ..
Recommended Video

2018లో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధి
ఇర్ఫాన్ ఖాన్ వయసు 54 సంవత్సరాలు. 2018లో ఇర్ఫాన్ ఖాన్ 2018లో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వ్యాధి బారిన పడ్డారు. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వ్యాధి నుంచి బయటపడటానికి ఆయన లండన్‌లోని ప్రముఖ హాస్పిటల్ చికిత్స పొందారు. కొన్ని నెలల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితమే తల్లి మరణించడం ఆయనను కలిచి వేసింది. లాక్ డౌన్ కారణంగా ఆమె అంత్యక్రియలకు కూడా దూరంగా ఉన్నారు.

అంగ్రేజీ మీడియంతో మళ్లీ
తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే కరోనావైరస్ ముప్పుతో లాక్‌డౌన్ ప్రకటించడంతో థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేశారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. హాట్‌స్టార్‌లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కిన విషయం తెలిసిందే.

ఇర్ఫాన్ కెరీర్, ఫ్రొఫెషనల్ లైఫ్
ఇర్ఫాన్ ఖాన్‌కు భార్య సుతాపా సిక్దర్, బాబిల్, ఆయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు తోడుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. జైపూర్‌లోని టోంక్ నవాబు వంశానికి చెందిన ఇర్ఫాన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందారు. ఆ తర్వాత చాణక్య, బనేగి అప్నీ బాత్, భారత్ ఏక్ కోజ్,చంద్రకాంత లాంటి టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత సలాం బాంబే, మక్బూల్, లైఫ్ ఇన్ ఏ మెట్రో, పాన్ సింగ్ తోమార్, పీకూ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

సుజిత్ సర్కార్ సంతాపం
ఇర్ఫాన్ ఖాన్ మృతిని దర్శకుడు షుజిత్ సర్కార్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధృవీకరించారు. నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్. పోరాటం.. పోరాటం.. పోరాటం నీ ఆయుధంగా మారింది. అందుకు నేను గర్వపడుతున్నాను. మళ్లీ మనం కలుసుకొందాం. భార్య సుతాప, కొడుకు బాబిల్‌కు నా తీవ్ర సంతాపం.. మీరు కూడా ఇక ఎనలేని పోరాటం చేయాలి. పోరాటం చేయడానికి ఆయన అన్ని నీకు ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇర్ఫాన్ ఖాన్‌కు సెల్యూట్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











