మరణానికి ముందు ఇర్ఫాన్.. భార్యతో షాకింగ్ విషయాలు.. ఆయన చివరి మాటలు ఏమిటంటే

గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధి (కోలన్ ఇన్‌ఫెక్షన్)తో పోరాటం చేస్తున్న ఇర్ఫాన్ ఖాన్‌ను మరో విషాదం వెంటాడింది. గత నాలుగు రోజుల క్రితం తల్లి సయిదా బేగం జైపూర్‌లో మరణించడం మనోవేధనకు గురిచేసింది. ఆ పరిస్థితుల్లోనే ఆరోగ్య విషమించడంతో ఇర్ఫాన్‌ను ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఇర్ఫాన్ కన్నుమూయడంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ లోకం నుంచి వెళ్లడానికి ముందే తనకు మరణం తప్పదనే విషయాన్ని ఇర్ఫాన్ గ్రహించారనేది అత్యంత విషాదంగా మారింది. తన భార్యతో పంచుకొన్న విషయాలు ఇవే..

Recommended Video

Irrfan Khan's Last Words || అమ్మ నాకోసం వేచి చూస్తున్నది. ఇక వెళ్లక తప్పడం లేదు...!!
తల్లి మరణంతో ఇర్ఫాన్

తల్లి మరణంతో ఇర్ఫాన్

ఇర్ఫాన్ తల్లి సయిదా అంత్యక్రియలు శనివారం సాయంత్రం జైపూర్‌లో జరిగాయి. లాక్‌డౌన్ కారణంగా వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అంత్యక్రియలకు హాజరయ్యారు. అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదనే విషయాన్ని సన్నిహితులు వెల్లడించారు. అలా తల్లి మరణం జరిగిన మరుసటి రోజే ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో తరలించారు.

మరణాన్ని ముందే ఊహించి..

మరణాన్ని ముందే ఊహించి..

కోకిలా బెన్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతున్నా గానీ.. తనకు మరణం తప్పదనే విషయం ఇర్ఫాన్‌కు అర్ధమైంది. అందుకే ప్రతీసారి కుటుంబ సభ్యులతో వీలైనంత సేపు గడిపారు. పిల్లలకు, భార్యకు ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఇక ముందు చేయాల్సిన జీవన పోరాటానికి సన్నద్ధం కావాలనే విషయాన్ని వారికి చెప్పకనే చెప్పారు అని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో పేర్కొన్నది.

భార్యతో ఇర్ఫాన్ చివరి మాటలు

భార్యతో ఇర్ఫాన్ చివరి మాటలు

తన మరణానికి కొద్ది గంటల ముందు భార్య సుతపా సిక్దర్‌తో చివరి మాటలు మాట్లాడరట. రెండు రోజుల క్రితం మరణించిన తన తల్లి తన కోసం వచ్చింది. ఆమె నా కోసం వేచి చూస్తున్నది. ఇక వెళ్లక తప్పడం లేదు. మా అమ్మ నన్ను తోడ్కోని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు అని ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో చివరి మాటలు చెప్పారట. ఇర్ఫాన్ మరణం సమయంలో ఇద్దరు కుమారులు బాబిల్, ఆయాన్ ఆయన వెంటే ఉన్నారు.

ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తి

ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తి

తన జీవిత ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించిన ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా శశ్మాన వాటికలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముగిసాయి. ఆయన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.దర్శకులు విశాల్ భరద్వాజ్, కామెడీ నైట్స్ విత్ కపిల్ షో హోస్ట్ కపిల్ శర్మ, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ మికా సింగ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. లాక్‌డౌన్ కారణంగా బాలీవుడ్ ప్రముఖులెవరూ పెద్దగా హాజరుకాలేకపోయారు. పలువురు ఇర్ఫాన్ ఖాన్‌ను తలచుకొని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X