twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Book My Show పై నిప్పులు చెరిగిన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే?

    |

    బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్ (పెటా) ఇండియాకు సేవలు అందిస్తున్నారు. అయితే సర్కస్‌లో జంతువులను హింసించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్కస్ షోల కోసం బుక్ మై షో టికెట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నది. అయితే జంతువులను హింసిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడం తప్పు అంటూ బుక్‌మైషో సీఈవోకు ఘాటుగా లేఖ రాశారు. జంతురహిత వినోదాన్ని అందించాలని ఆయన లేఖలో సూచించారు.

    పెటాకు మాజీ పర్సన్ ఆఫ్ ఇయర్‌గా వ్యవహరించారు. అయితే దేశంలో పలు ప్రాంతాల్లో సర్కస్ నిర్వహిస్తున్న రాంబో సర్కస్‌లో జంతువులను బాధించడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇటీవలే పూణెలో ఈ సర్కస్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైన విషయాన్ని తెలిపారు.

    Actor John Abraham writes a letter to Book My Show CEO over sale of Circus tickets

    రాంబో సర్కస్‌లో కుక్కలను హింసించి వాటితో వినోదాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ సర్కస్‌కు సంబంధించిన టికెట్లను బుక్‌మైషో వెబ్‌సైట్‌లో అమ్మకూడదని సీఈవో ఆశీష్ హెమ్‌రంజానీని కోరారు.

    ప్రపంచవ్యాప్తంగా చాలా సర్కస్ కంపెనీలు మానవులతోనే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. జంతువులను కేవలం అలంకార వస్తువులుగా వాడుకొంటున్నారు. జంతువులకు, మూగ జీవాలకు హాని తలపెట్టకుండా వినోదాన్ని అందిస్తున్నారు. కొన్నిసార్లు జంతువులు వినకపోతే వాటిని దారుణంగా శిక్షిస్తున్నారు. ఇలాంటి సర్కస్ కంపెనీలను ప్రోత్సహించకూడదు అని జాన్ అబ్రహం తన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Actor John Abraham writes a letter to Book My Show CEO over sale of Circus tickets. He requested the former to put an end to ticket sales. Dogs are forced to perform unregistered tricks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X