వణికిపోతూనే లిప్‌లాక్.. మూడు రోజులపాటు ఏకధాటిగా ముద్దులే ముద్దులు

బాలీవుడ్‌లో 90వ దశకంలో రిలీజైన రాజా హిందూస్థానీ చిత్రం కుర్రకారును ఉర్రూతలూగించడమే కాకుండా ఎంతటి ప్రభంజాన్ని సృష్టించిందే అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య కెమిస్ట్రీ యువతకు గిలిగింతలు పెట్టింది. 1990లో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రాజా హిందూస్థానీ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ చిత్రంలో రొమాంటిక్ విషయాలను తాజాగా హీరోయిన్ కరిష్మా కపూర్ మీడియాతో పంచుకొన్నది. వివరాల్లోకి వెళితే..

వెబ్‌ సిరీస్‌లో కరిష్మా కపూర్

వెబ్‌ సిరీస్‌లో కరిష్మా కపూర్

ప్రస్తుతం కరీష్మా కపూర్ జీ 5 ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో మెంటల్‌హుడ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. ఆ వెబ్ చిత్రం ప్రమోషన్ సందర్భంగా రాజా హిందుస్థానీ సినిమాలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొన్నది. కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలా ఇబ్బందికి గురయ్యాం అని కరిష్మా కపూర్ తమ అనుభవాలను వెల్లడించింది.

మంచి చలికాలంలో ఊటీలో షూట్

మంచి చలికాలంలో ఊటీలో షూట్

రాజా హిందూస్థానీ సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. ఫిబ్రవరి మాసం కావడంతో గడ్డ కట్టేంత చలి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ చేశాం. ఆ చిత్రంలోని లిప్‌లాక్ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. దాదాపు మూడు రోజులపాటు ఆ సీన్‌ను చిత్రీకరించారు.ఆ ముద్దు సీన్ ఎప్పుడు అయిపోతుందో అని మాకు అనిపించేది అని కరిష్మా కపూర్ తెలిపారు.

గడ్డకట్టేంతగా చలిగాలులు

గడ్డకట్టేంతగా చలిగాలులు

షూటింగ్ సమయాల్లో గడ్డ కట్టేంత చలిగాలి, నీళ్లు మంచు ముద్దలా మారే పరిస్థితి. విపరీతమైన చలి కారణంగా ప్రతీ టేక్‌లో అమీర్ ఖాన్, నేను వణికిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముద్దు సీన్‌లో నటిస్తూనే ఉన్నాం అని కరిష్మా కపూర్ పేర్కొన్నారు.

Recommended Video

Salman Khan To Become Father Without Marriage || Filmibeat Telugu
పెళ్లి, విడాకుల తర్వాత రీ ఎంట్రీ

పెళ్లి, విడాకుల తర్వాత రీ ఎంట్రీ

బాలీవుడ్‌లో కెరీర్ పీక్‌లో ఉండగానే కరిష్మా కపూర్ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత భర్తతో విడిపోయిన తర్వాత చాలా కాలం ఒంటరిగానే ఉంది. 2012లో డేంజరస్ ఇష్క్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం కూతురు సమీరా, కుమారుడు కియాన్‌తో జీవితం వెళ్లదీస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X