హీరోపై రేప్, చీటింగ్ కేసు.. అయినా పెళ్లికి సిద్దమైన టాలీవుడ్ హీరోయిన్!

By Rajababu

రేప్, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు మహాక్షయ్ చక్రవర్తి పెళ్లికి సిద్దమవుతున్నాడు. రేప్ కేసుతోపాటు ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో అతడిని టాలీవుడ్ హీరోయిన్ మదాలస శర్మ వివాహాం చేసుకోవడానికి ముందుకు రావడం బాలీవుడ్‌ వర్గాలో చర్చనీయాంశమైంది. మదాలస శర్మ ఫిట్టింగ్ మాస్టర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Recommended Video

మిథున్ చక్రవర్తి కుమారుడు పై యువతీ కేసు నమోదు
 గర్భవతి కావడంతో అబార్షన్

గర్భవతి కావడంతో అబార్షన్

ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, యోగితా బాలి దంపతుల కుమారుడైన మహాక్షయ్ అలియాస్ మిమోపై ఇటీవల ఓ యువతి కేసు నమోదు చేశారు. తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకొంటానని మోసగించాడు. గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు అనే ఆరోపణలపై మిమోపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

మదాలస శర్మతో మిమో పెళ్లి

మదాలస శర్మతో మిమో పెళ్లి

ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మరో నాలుగు రోజులకే మిమోతో మదాలస శర్మ పెళ్లి ఖారారైంది. ఈ విషయాన్ని అలనాటి నటి, మదాలస తల్లి షీలా శర్మ ధ్రువీకరించారు. జూలై 7 తేదీన మదాలస శర్మతో మిమో వివాహం జరుగనున్నదని పేర్కొన్నారు.

 మిమో కూడా కేసు పెట్టి

మిమో కూడా కేసు పెట్టి

ఇదిలా ఉండగా, తనపై కేసు దాఖలు చేసిన యువతిపై హీరో మిమో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తనను వేధింపులకు గురిచేసి బాధపెట్టింది? నా పెళ్లికి ముందు కావాలని నాపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టింది?. నేను తప్పు చేస్తే నాపై చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేసింది? అనే ప్రశ్నలు సంధిస్తూ తనపై ఆరోపణలు చేసిన యువతిపై మిమో కేసు పెట్టారు.

 మిథున్ చక్రవర్తి భార్య బెదిరింపులు

మిథున్ చక్రవర్తి భార్య బెదిరింపులు

తన కుమారుడిపై కేసు పెట్టిన యువతికి మిథున్ భార్య యోగితా కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారట. అంతేకాకుండా కేసు వాపసు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మిమో, మదాలస శర్మ వివాహానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

మదాలస శర్మ, మిమో గురించి

మదాలస శర్మ, మిమో గురించి

మహాక్షయ్ చక్రవర్తి జిమ్మి అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత హాంటెడ్ 3డీ, లూట్, ఎనీమీ, ఇష్కదరియాన్ చిత్రాల్లో నటించారు. మదాలస శర్మ తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆలస్యం, అమృతం, మేము వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ లాంటి సినిమాల్లో నటించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X