Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమితాబ్ మనవరాలిని పెళ్లిచేసుకోవాలని ఉంది.. ప్రముఖ హీరో కుమారుడి కోరిక..
ప్రముఖ నటుడు, డ్యాన్సర్, టెలివిజన్ హోస్ట్ జావెద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశాడు. ఆయన నటించిన మలాల్ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాదిలో ఘన విజయం సాధించిన 7జీ బృందావన్ కాలనీ సినిమా ఆధారంగా మలాల్ రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్, మహావీర్ జైన్, కిషన్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో మీజాన్కు జంటగా సంజయ్ లీలా భన్సాలీ మేన కోడలు షర్మీన్ జంటగా నటించింది. ఈ చిత్రానికి మంగేష్ హదావాలే దర్శకత్వం వహించారు.
మలాల్ సినిమాకు ముందు మీజాన్, బీగ్ బీ అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందాతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు వైరల్ అయ్యాయి. వారిద్దరి సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హంగామా చేసింది. మలాల్ సినిమా ప్రమోషనల్లో భాగంగా నవ్య నందాతో డేటింగ్ గురించి మీజాన్ మాట్లాడుతూ.. మా మధ్య రిలేషన్ లేనప్పుడూ ఎందుకు అంగీకరించాలి అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో గురించి అడిగితే.. తాము ఇద్దరం న్యూయార్క్‌లో కలిసి చదువుకొన్నాం. ఆ సందర్భంగా దిగిన ఫోటో. అందులో విశేషం ఏమీలేదు అని మీజాన్ బదులిచ్చాడు. నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరితో అఫైర్ లేదు.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ చేయాలని అనుకొంటున్నాను అని అన్నారు.
నవ్య నవేలి నందా, సారా అలీ ఖాన్, అనన్య పాండే,లో ఎవరినీ పెళ్లి చేసుకొంటావని అడిగితే.. నవ్య నవేలి నందాను పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.