Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో 4 రోజుల్లో హీరోయిన్‌తో పెళ్లి... బాలీవుడ్ స్టార్ కొడుకుపై రేప్, చీటింగ్ కేసు!
Recommended Video
'ఫిట్టింగ్ మాస్టర్' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి... ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ, రామ్ లీలా తదితర చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ మదాలసా శర్మ జులై7న పెళ్లి చేసుకోబోతోంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిని ఆమె పెళ్లడబోతోంది. మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగా మహాక్షయ్ మీద చీటింగ్, రేప్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. అతడితో పాటు తల్లి యోగితా బాలిపై ఓ యువతి కేసు పెట్టింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపణ
మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, 2015 నుండి తనతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని కంప్లయింట్లో పేర్కొంది. తర్వాత తనకు ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.
యోగితా బాలిపై కూడా కేసు
మహాక్షయ్
తల్లి,
మిథున్
భార్య
యోగితా
బాలి
కూడా
ఇందుకు
సహకరించిందని,
నువ్వు
ఎప్పటికీ
నా
కోడలివి
కాలేవని
తనను
బెదిరించందని,
అందుకే
ఆమెపై
కూడా
కేసు
పెట్టినట్లు
సదరు
యువతి
తెలిపింది.
వివిధ సెక్షన్ల కింద కేసులు
యువతి కేసు పెట్టడంతో మహాక్షయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఐపిసి 90, 375, 114ఎ, 415, 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మిథున్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందనే విషయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
మదాలసా, మహాక్షయ్ రిలేషన్
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలసా శర్మ కొంత కాలంగా మహాక్షయ్ చక్రవర్తితో రిలేషన్లో ఉంది. ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజా కేసు నేపథ్యంలో ఏం జరుగబోతోంది అని హాట్ టాపిక్ అయింది.