నవాజుద్దీన్ సిద్ధిఖీకి చేదు అనుభవం.. చుక్కలు చూపించిన అభిమానులు
స్టార్ హీరోలు జనంలోకి వెళ్లినప్పుడు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అభిమానులు విపరీతంగా తోసుకొని మీద పడటం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటనే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఎదురైంది. తాజాగా రాత్ అకేలీ హై అనే చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం కాన్పూర్‌కు వెళ్లాడు. ఆ సందర్భంగా అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
నవాజుద్దీన్ సిద్దిఖీతో సెల్పీలు దిగడానికి వందలాది మంది తోసుకొచ్చారు. తాకిడిని తప్పించుకొంటూ కారు ఎక్కడానికి ప్రయత్నించగా.. ఓ అభిమాని నవాజుద్దీన్ మెడపట్టి లాగాడు. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన బాడీగార్డులు వారిని తోసేశారు. అనంతరం నవాజుద్దీన్‌ను కారులోకి ఎక్కించి సురక్షితంగా పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన థాక్రే చిత్రం ఘనవిజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రంలో శివసేన అధినేత బాల థాక్రేగా నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











