మొన్న సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్ హీరో.. కేటుగాళ్లు ఎవరినీ వదలట్లేదుగా!
ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు ఎవర్నీ వదలడం లేదు. మొన్నటికి మొన్న ఏకంగా సన్నీ లియోన్ పాన్ కార్డు వాడి లోన్ తీసుకున్న కేటుగాళ్లు ఇప్పుడు రాజ్ కుమార్ రావును కూడా వదల్లేదు. తాజాగా ఆయన కార్డు వాడి టోకరా వేసినట్టు ఆయన స్వయంగా వెల్లడించాడు. ఆ వివరాలు..

రుణం తీసుకున్నాడని
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ ఇటీవల మోసానికి గురయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజ్‌కుమార్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. తన పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వెల్లడించాడు. తన పాన్ కార్డు ద్వారా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన పేరు మీద రుణం తీసుకున్నాడని రాజ్‌కుమార్ చెప్పాడు. దీని కారణంగా, అతని CIBIL స్కోర్ కూడా క్షీణించిందని అన్నారు.

అధికారిక ఖాతాను కూడా ట్యాగ్
రాజ్‌కుమార్ రావు పోస్ట్‌ను షేర్ చేసి, "#FraudAlert. నా PAN కార్డ్‌ని ఎవరో దుర్వినియోగం చేసారు మరియు నా పేరు మీద 2,500 రూపాయల చిన్న రుణం తీసుకున్నారు. దీని కారణంగా నా CIBIL స్కోర్ ప్రభావితమైంది . రాజ్‌కుమార్ తన పోస్ట్‌లో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) అధికారిక ఖాతాను కూడా ట్యాగ్ చేశారు.

హృదయపూర్వకంగా చింతిస్తున్నాము
దీంతో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. ఇది మేము మీకు జరగాల్సిన విషయం అయితే కాదు. మీ TUCIBIL నివేదికలో ప్రతిబింబించే తప్పు ఖాతా నంబర్‌ను మాకు DM చేయమని అభ్యర్థిస్తున్నామని పేర్కొంది. ఇక రాజ్‌కుమార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అనేక మంది దానిపై కామెంట్ చేస్తున్నారు

సన్నీ లియోన్ కూడా
ఇంతకుముందు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా తన పాన్ కార్డ్‌ని ఉపయోగించి ఎవరైనా ₹ 2,000 రుణం తీసుకున్నారని ఆరోపించారని, అది ఆమె క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేసిందని ఇలాగే ఆన్ లైన్ లో ఆమె సిబిల్ దృష్టికి తీసుకొచ్చింది. ఇక తన పాన్ కార్డును ఉపయోగించి ధని యాప్ నుంచి రుణం తీసుకున్నారని సన్నీలియోన్ ఆరోపించింది. అయితే పాన్ కార్డు మోసానికి రాజ్‌కుమార్ రావ్ ఒక్కరే కాదు చాలా మంది సామాన్యులు కూడా బాధితులుగా మారుతున్నారు.

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి
మీరు కూడా పాన్ కార్డు ద్వారా ఏమైనా లోన్లు తీసుకున్నారేమో చెక్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ చేసి, ఆపై సేవల విభాగానికి వెళ్లి, ఫారం 26ASపై క్లిక్ చేయండి. PAN చరిత్రను తెలుసుకోవడానికి ఫారమ్ 26ASని డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 26AS ఫారమ్‌లో లావాదేవీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

సినిమాల విషయానికి వస్తే
ఇక రాజ్‌కుమార్ సినిమాల విషయానికి వస్తే త్వరలో 'మోనికా, ఓ మై డార్లింగ్', 'భిడే', 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' మరియు 'హిట్' వంటి సినిమాల్లో కనిపించనున్నారు. ఇక రాజ్‌కుమార్ రావు చివరిసారిగా ఫిబ్రవరి 11న విడుదలైన 'బధాయి దో'లో కనిపించారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు భూమి పెడ్నేకర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు.


Click it and Unblock the Notifications











