డబ్బులు లేక కాలినడకనే ఆఫీసులకు... పీకల్లోతు కష్టాలపై పెదవి విప్పిన రాజ్‌పాల్

సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం అది పెద్ద సవాలే అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతిభ ఉన్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు చాలా తక్కువగా ఉంటారు. అంతేకాకుండా సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కెరీర్ సాగడం మరో సవాల్‌ అని చెప్పవచ్చు. స్టార్ యాక్టర్‌గా బాలీవుడ్‌లో పేరు సంపాదించుకొన్నప్పటికీ.. తాజా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడిస్తూ...

రాంగోపాల్ వర్మ సపోర్ట్‌తో

రాంగోపాల్ వర్మ సపోర్ట్‌తో

నటుడు రాజ్‌పాల్ యాదవ్ తొలుత దిల్ క్యా కరే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చి పోత్సహించాడు. మస్త్, షూల్, జంగల్, కంపెనీ లాంటి చిత్రాలతో తన ప్రతిభను చాటుకొన్నారు. దాంతో బాలీవుడ్‌లో కెరీర్ జువ్వుమని సాగిపోయింది.

తాజాగా హంగామా 2లో

తాజాగా హంగామా 2లో


ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్‌లో హంగామా 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అఫ్దాబ్ శివదాని, రిమిసేన్, పరేష్ రావెల్‌ తదితరులు నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రియదర్శన్ మాట్లాడుతూ.. నేను ఇంటెలిజెంట్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయను. ఇంటిల్లిపాది నవ్వుకునే విధంగా సాధారణ ప్రేక్షకుల కోసం సినిమా తీస్తానని వెల్లడించారు.

2018లో పీకల్లోతు కష్టాల్లో

2018లో పీకల్లోతు కష్టాల్లో


ఇక హంగామా 2 సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న రాజ్‌పాల్ యాదవ్ 2018లో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన విషయం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అవకాశాలు లేక అనేక సమస్యల్లో ఉంటే చాలా మంది ఆదుకొన్నారు. అలాంటి సహకారం లేకపోతే మీ ముందు ఉండేవాడిని కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు బాలీవుడ్‌లో అందరూ ఆదుకొన్నారు అని రాజ్‌పాల్ యాదవ్ తెలిపారు.

నటుడు కావాలని ముంబైలో అడుగుపెట్టినప్పుడు

నటుడు కావాలని ముంబైలో అడుగుపెట్టినప్పుడు


తన కష్టాల గురించి మాట్లాడుతూ.. కేవలం ఇప్పుడే కాదు.. యాక్టర్ కావాలని ముంబైకి వచ్చినప్పుడు.. నాకు నగరం గురించి ఏమీ తెలియదు. బోరివాలి ప్రాంతానికి చేరుకోవడానికి షేర్ ఆటోలో వచ్చే వాడిని. కొన్నిసార్లు డబ్బులు లేని సమయంలో జుహు, లోఖండ్‌వాలా, ఆదర్శ్ నగర్, గోరేగావ్ లాంటి ప్రాంతాలకు నడచుకొంటూ వెళ్లేవాడిని అని రాజ్‌పాల్ యాదవ్ తెలిపారు.

కాలినడకతోనే ఆఫీసులకు

కాలినడకతోనే ఆఫీసులకు


బాలీవుడ్‌ ఆఫర్ల కోసం చాలా ఆఫీసులకు కాలినడకనే వెళ్లాను. చేతిలో ఫోటోలు పట్టుకొని నా గురించి చెప్పుకొన్నారు. అదొక మిషన్‌లా గడించింది. అలాంటి పని అంత సులభమైంది కాదు. జీవితమనేది ఎన్నో పరీక్షలను పెడుతుంది. వాటిని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులను మనం కల్పించుకోవాలి అంటూ రాజ్‌పాల్ యాదవ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X