కిడ్నీ ఫెయిలై నటుడు మృతి.. భార్యకు ముందే అన్నీ వివరంగా!

జూలై 29న టీవీ పరిశ్రమ నుండి చాలా విచారకరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ రసిక్ దవే కన్నుమూశారు. రాసిక్ దవే వయసు 65 ఏళ్లు. అందుతున్న సమాచారం ప్రకారం, రాసిక్ దవే గత రెండేళ్లుగా డయాలసిస్‌లో ఉన్నారు. 15 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆయన జీవిత యుద్ధంలో ఓడిపోయాడు. రసిక్ దవే కన్నుమూశారు. కానీ ఆయన మరణించే ముందు, తన భార్య కేత్కీ దవే కి ఒక ప్రత్యేక విషయం చెప్పాడట. గత కొన్నేళ్లుగా ఆయనకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని అయినా రాసిక్ తన అనారోగ్యం గురించి ఎప్పుడూ మాట్లాడటానికి ఇష్టపడలేదని అన్నారు. కాబట్టి, ఆయన ఆరోగ్యం క్షీణించడం గురించి మేము ఎవరితోనూ పంచుకోలేదని అన్నారు.

ఇక గత కొన్ని రోజులుగా, నేను ఎప్పుడూ పనిని ఎలా కొనసాగించాలో ఆయన నాకు చెప్పాడని అన్నారు. పని చేసే మానసిక స్థితిలో లేనని చెప్పాను, కాని ఆయన మాట మేరకు నటన తప్పక కొనసాగిస్తానని అన్నారు. నేను ఎప్పటికి పని మానేయకూడదని ఆయన కోరుకున్నారని ఆమె వెల్లడించారు. అస్వస్థతలో ఉన్నప్పుడు కూడా అంతా బాగానే ఉంటుంది, ఆశలు వదులుకోకూడదని చెబుతూనే ఉన్నాడని అన్నారు. ఈరోజు తను నా పక్కనే ఉన్నాడు కాబట్టి ధైర్యంగా అన్నీ నిర్వహిస్తున్నాను.నాకు నా కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ, నా పిల్లలు, నా అత్తగారు మరియు వారందరూ నాకు మద్దతుగా ఉన్నారు, కానీ నేను నా భర్తను చాలా మిస్ అవుతున్నానని ఆమె అన్నారు.

 Actor Rasik Dave dies at 65 due to kidney failure

ఇక నటి అల్పనా బుచ్ అలాగే రసిక్ డేవ్ థియేటర్ ఆర్టిస్టులు అలాగే మంచి స్నేహితులు కూడా. తాజా ఇంటర్వ్యూలో, అల్పనా బుచ్ తన స్నేహితురాలయిన కేత్కి డేవ్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. రాసిక్ దవే అంత్యక్రియకు వచ్చిన అల్పనా.. మేం కలిసి ప్రకటనల్లో పనిచేశామని, రూప్ మర్ద్ క నాయ స్వరూప్ లో నా భర్తగా కూడా నటించాడని అన్నారు. ఇక రసిక్‌ దేవ్‌ పుత్ర వధు అనే గుజరాతీ సినిమాతో సినిమా పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. తన భార్య కేత్కితో కలిసి నాచ్‌ బలియే డ్యాన్స్‌ షోలోనూ పాల్గొన్నారు. ఇకపోతే రసిక్‌ బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితమే ఆయన మహాభారత్‌ సీరియల్‌లో నంద పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X