ఆయనకు మసాజ్ చేయడానికి ఒప్పుకున్నా.. ఆ రాత్రి గడపకపోతే.. 73 ఏళ్ల దర్శకుడి రాసలీలలు!
మీటూ ఉద్యమం బాలీవుడ్ లో పెను దుమారంగా మారుతోంది. మీటూ ఉద్యమం ప్రారంభమైంది హాలీవుడ్ లో. అక్కడ కూడా ఇంత సంచలనం సృష్టించలేదేమో. కానీ బాలీవుడ్ లో మీటూ ఉద్యమం వలన కొందరి జాతకాలే తిరగబడిపోతున్నాయి. ప్రముఖ నటి, మోడల్ అయిన కేట్ శర్మ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు 73 ఏళ్ల సుభాష్ ఘయ్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనని బలవంతంగా అనుభవించడానికి ప్రయతించాడని తాజాగా ఆమె పోలీసు కేసు నమోదు చేసింది. సీనియర్ దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

గత ఆగష్టులోనే
ఈ సంఘటన గత ఆగష్టులోనే జరిగినట్లు కేట్ శర్మ వివరించింది. సుభాష్ ఘయ్ తనని ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో ఇంట్లో మరి కొందరు వ్యక్తులు ఉన్నారు. మసాజ్ చేయమని అడిగాడు. నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యా. కానీ ఆయన సీనియారిటీని గౌరవించి మసాజ్ చేసేందుకు అంగీకరించా అని కేట్ శర్మ తెలిపింది.

వాష్ రూమ్‌కు నా వెంటే
మసాజ్ చేశాక చేతులు శుభ్రం చేసుకోవడానికి వాష్ రూమ్ కు వెళ్ళా. సుభాష్ ఘయ్ కూడా నా వెనుకే వచ్చాడు. నాతో ప్రత్యేకంగా మాట్లాడాలని తన గదికి తీసుకుని వెళ్ళాడు. బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అతడిని వదిలించుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నించా.

రాత్రి గడపకపోతే
తనతో రాత్రి గడపకపోతే తాను భోజనం కూడా చేయనని సుభాష్ బెదిరించినట్లు కేట్ తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనితో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇప్పటికే వికాస్ బహల్, షాజిత్ ఖాన్, సౌమిక్ సేన్, వంటి బాలీవుడ్ దర్శకులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మీటూ ఉద్యమాన్ని గౌరవించా
తనపై వస్తున్న ఆరోపణలపై సుభాష్ ఘయ్ స్పందించారు. తాను మీటూ ఉద్యమాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు. కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని కేట్ ఆరోపణలపై మండిపడ్డారు. ఈ ఆరోపణలని తాను చట్ట పరంగానే ఎదుర్కొంటానని తెలిపారు.


Click it and Unblock the Notifications











