15000 కోట్ల బెట్టింగ్ కుంభకోణంలో యువ హీరోకు సమన్లు!
సినీ పరిశ్రమను కుదిపేసిన బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోకు పోలీసులు సమన్లు జారీ చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు సంచలన రీతిలో దర్యాప్తు జరుగుతున్నది. ఈ కేసులో పలువురు హీరోలు, హీరోయిన్లను పలు దఫాలుగా విచారిస్తూ వస్తున్నారు. ఈ కేసులో తాజాగా ఓ హీరోకు నోటీసులు ఇవ్వడం గందరగోళంగా మారింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
మహాదేవ్ బెట్టింగ్ యాప్ యాజమాన్యం రికార్డు స్థాయిలో ఓ పెళ్లికి ఖర్చు చేయడంతో అందరి దృష్టి వారిపై పడింది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారనే విషయంపై ఆరా తీయడంతో ఈ స్కామ్ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో 15 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం సంచలనం రేపింది.

గతేడాది ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ఉప్పల్ అనే వ్యక్తిపై ఈడీ, ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దాంతో దుబాయ్‌లో అతడిని స్థానిక అధికారులు అరెస్ట్ చేయడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. గత కొద్ది నెలలుగా విచారణ చేపట్టిన ముంబై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు తాజాగా బాలీవుడ్ హీరో సాహిల్‌కు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నటుడు సాహిల్ ఖాన్‌కు ముంబై సిట్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో అతడి వాదనను రికార్డు చేయనున్నట్టు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

యాక్టర్ సాహిల్ ఖాన్ విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యువ హీరోల్లో ఒకరు. ఆయన స్టైల్, ఎక్స్‌క్యూజ్‌మీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే డివైన్ న్యూట్రిషన్ అనే సంస్థను సొంతంగా స్థాపించి నడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











