కోలుకొన్న సంజయ్ దత్.. లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 8వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలతో భాధపడుతూ ఆయన లీలావతి హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే. గతవారం జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆయనకు నెగిటివ్ అని తేలడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు.

అయితే ఆరోగ్య సమస్యలు అలానే తీవ్రం కావడంతో లీలావతి హాస్పిటల్‌లో నాన్ కోవిడ్ వార్డులో ఆయన చేరడం జరిగింది. సోమవారం పూర్తి పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం ఉండటంతో ఆయనను డిశ్చార్జి చేశారు.

 Actor Sanjay Dutt discharged from Leelavati hospital

ఇక సంజయ్ దత్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన సడక్ 2 చిత్రం ఆగస్టు 28వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు. పూజా భట్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.

సడక్ 2 తర్వాత సంజయ్ దత్ దక్షిణాది చిత్రం కేజీఎఫ్2లో విలన్ పాత్రను పోషించారు. అధీరా పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆయన జన్మదినం రోజున రిలీజ్ చేశఆరు. ఈ చిత్రంలో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి నటించారు. కేజీఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కూడా డైరెక్టర్‌గా వ్యవహరించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X