twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌ దత్‌పై మళ్లీ రూమర్లు... క్లారిటీ ఇచ్చిన ఖల్‌నాయక్

    |

    దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు ఉధృతంగా సాగుతున్నది. ప్రధాన పార్టీలతోపాటు చిన్న చితక పార్టీలు తమ గెలుపు అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని వార్తలు, ఊహాగానాలు మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. తాజా ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుకు పరీక్షగా మారిన నేపథ్యంలో బీజేపీ పార్టీ రకరకాల వ్యూహాలను రచిస్తున్నది. ఇటీవల బాలీవుడ్ నటులు సల్మాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌ను పార్టీ ప్రచారానికి రావాలని, వీలైతే ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే సంజయ్ దత్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీచేస్తున్నట్టు వార్త మీడియాలో గుప్పుమన్నది. అయితే దానిపై సంజయ్ వివరణ ఇస్తూ..

     ఆ వార్తలన్నీ రూమర్లే

    ఆ వార్తలన్నీ రూమర్లే

    లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ఓ వార్త నా దృష్టికి వచ్చింది. అయితే అందులో వాస్తవం లేదు. అలాంటి వార్తలన్నీ రూమర్లే అని సంజయ్ ఖండించారు. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా చూపంత నా కెరీర్‌పైనే ఉంది. ప్రస్తుతం నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు అని స్పష్టం చేశారు.

    దేశం కోసం ఓటు హక్కు అని

    దేశం కోసం ఓటు హక్కు అని

    రాజకీయాల్లోకి రానంటూనే సంజయ్ దత్ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నా సోదరి ప్రియాదత్‌కు పూర్తి సహకారం అందిస్తున్నాను. దయచేసి దేశం కోసం మీ ఓటు హక్కును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి అని సంజయ్ ట్వీట్ చేశారు.

    రాజకీయాలకు దూరంగా సంజయ్ దత్

    రాజకీయాలకు దూరంగా సంజయ్ దత్

    2009లో సంజయ్ దత్ సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో నుంచి పోటీ చేశారు. అయితే ఆయుధాల చట్టం కింద శిక్ష పడటంతో కోర్టు ఆదేశాల మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకొన్నారు. అప్పటి నుంచి సంజయ్ దత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా లోక్‌సభకు పోటీచేస్తున్నట్టు వార్తలు రావడంతో వాటిని తోసిపుచ్చారు.

    సల్మాన్ ఖాన్ ఖండన

    సల్మాన్ ఖాన్ ఖండన

    కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే అవన్నీ రూమర్లే అని సల్మాన్ కొట్టిపడేశాడు. ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయడం లేదు, ప్రచారం కూడా చేయడం లేదు అని సల్మాన్ ట్వీట్ చేశారు.

    English summary
    Actor Sanjay Dutt quashes rumours of contesting Lok Sabha elections, He tweeted that "The rumour about me contesting for the Lok Sabha elections is not true. I stand with my country and in full support for my sister Priya Dutt. I urge everyone to come out in maximum numbers and cast their votes for our nation!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X