twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ది హత్యే.. సీబీఐ విచారణకు డిమాండ్.. ప్రముఖ నటుడి ఉద్యమం

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పలువురు ఇప్పటికే ఆయనది ఆత్మహత్య కాదు. హత్యే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నడం హిందీ చిత్ర పరిశ్రమలో వివాదంగా మారింది. కొందరు అభిమానులు ర్యాలీలు చేపడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ డిమాండ్లు మీడియాలో కనిపిస్తున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant కు న్యాయం జరగాలి..అందుకే Forum ప్రారంభించా! - Shekhar Suman
    సుశాంత్ మృతిపై అనుమానాలు

    సుశాంత్ మృతిపై అనుమానాలు

    సుశాంత్ మృతిపై చేపట్టిన దర్యాప్తులో వాస్తవాలు బయటకు రావాలి అనే డిమాండ్స్‌తో #SushantSinghRajputDeath, #JusticeForSushantForum లాంటి హ్యాష్ ట్యాగ్స్‌తో ఉద్యమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు, యాంకర్, హోస్ట్ శేఖర్ సుమన్ ఆన్‌లైన్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వరుస ట్వీట్లతో ఆయన ఎలాంటి హల్‌చల్ చేస్తున్నారు.

    అసామాన్య ప్రతిభావంతుడైన సుశాంత్

    అసామాన్య ప్రతిభావంతుడైన సుశాంత్

    సుశాంత్ సామాన్యమైన వ్యక్తి కాదు. మానసికంగా ధృడమైన వ్యక్తి, అసామాన్య ప్రతిభావంతుడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నారంటే ఎవరూ నమ్మరు. ఆయన మరణం వెనుక బలమైన అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలి. అందుకే నేను ట్విట్టర్‌లో జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరమ్ ప్రారంభించాను. సుశాంత్ మరణం వెనుక సీబీఐ దర్యాప్తు చేపట్టాలి అంటూ శేఖర్ సుమన్ డిమాండ్ చేశారు.

    గ్యాంగులు, మాఫియాలపై పోరాటం

    గ్యాంగులు, మాఫియాలపై పోరాటం

    బాలీవుడ్‌లో మాఫియా కార్యక్రమాలకు అంతం పలకాలి. గ్యాంగులు, గ్రూపులు చెల్లచెదురయ్యేలా ఉద్యమం చేయాలి. బయటి వ్యక్తులపై చేసే మానసిక దాడులను ధీటుగా ఎదురించాలి. సుశాంత్ జరిగిన అన్యాయంపై బలంగా, ఎలుగెత్తి నినాదం చేయాలి. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టే మాదిరిగా ఒత్తిడి తీసుకురావాలి. అందుకే ఫోరాన్ని ప్రారంభించాను. ప్రతి ఒక్కరి సహకారం అందించాలి అని శేఖర్ సుమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    బీహార్ సెంటిమెంట్‌తో ముందుకు

    బీహార్ సెంటిమెంట్‌తో ముందుకు

    సుశాంత్ బీహర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అందుకే బీహార్ సెంటిమెంట్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది కేవలం బీహారీ ఉద్యమం కాదు. దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరు తమ నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాలీవుడ్‌లో సుశాంత్ లాంటి మరో విషాదం జరగకుండా యువ ప్రతిభకు పట్టం కట్టేలా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం అని శేఖర్ సుమన్ అన్నారు.

    ఆన్‌లైన్ ఫోరమ్‌కు మద్దతు

    ఆన్‌లైన్ ఫోరమ్‌కు మద్దతు

    ఇలా వరుస ట్వీట్లతో నటుడు, హోస్ట్ శేఖర్ సుమన్ దడదడలాడించడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఆన్‌లైన్ ఫోరమ్‌కు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. సుశాంత్‌తో అనుబంధాన్ని, ఆయన టాలెంట్‌ను గుర్తు చేసుకొంటూ ఫోటోలు, వీడియోలు, ట్వీట్లతో నీరాజనం పడుతున్నారు. శేఖర్ సుమన్ ప్రారంభించిన ఆన్‌లైన్ ఉద్యమం ప్రభుత్వం దృష్టికి చేరుతుందా? సీబీఐ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తారా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

    English summary
    Actor, Television host Shekhar Suman's starts justice for Sushant forum movement in twitter. He twitted that, Im forming a Forum called #justiceforSushantforum.where i implore just about ev one to pressurize the govt to launch a CBI inquiry into Sushant's death,raise their voices against this kind of tyranny n gangism and tear down the mafias.i solicit your support.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X