Adnan Sami: భార్య నగ్న వీడియోలు లీక్ చేసిన స్టార్ సింగర్.. దారుణంగా సొంత తమ్ముడే అలా..

బాలీవుడ్ లో స్టార్ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అద్నాన్ సమీ. తెలుగులో కూడా ఈయన మెగాస్టార్ చిరంజీవి సినిమాలకి పాటలు పాడారు. ఇక అద్నాన్ సమీకి గాయకుడుగా మంచి పేరు ఉంది. భారత్ ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చి గౌరవించింది. పాకిస్తాన్ కి చెందిన అద్నాన్ సమీ అక్కడే గాయకుడిగా కెరియర్ ప్రారంభించి తరువాత ఇండియాకి వచ్చేశాడు.

భారత్ పౌరసత్వం తీసుకొని ఇండియాలో స్థిరపడ్డాడు. హిందీలో సక్సెస్ ఫుల్ గాయకుడుగా దూసుకుపోతున్నారు. ఆ మధ్య RRR మూవీ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు అందుకున్నప్పుడు వైఎస్ జగన్ చేసిన ట్వీట్ పై అద్నాన్ సమీ విమర్శలు చేశారు. దాంతో వైసీపీ అభిమానులు అతనిని ఫుల్ గా ట్రోల్ చేశారు.

Actor shocking comments on Bollywood popular singer adnan sami and latest update

ఆ ఘటన కారణంగా మరోసారి అద్నాన్ సమీ ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా అద్నాన్ సమీ సొంత తమ్ముడు జునైద్ ఖాన్ తన అన్నపై సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న నీచమైన చరిత్ర చెప్పాలంటే తనకే సిగ్గేస్తుంది అని, అయిన బయటపెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్న అంటూ సంచలన విమర్శలు చేశారు.

తన అన్న రెండో భార్య సబా గలదారీతో కలిసి నగ్న వీడియోలు చేసి వాటిని డీవీడీలు చేసాడని ఆరోపణలు చేశారు. వారిద్దరూ విడిపోయిన సమయంలో అవే వీడియోలని కోర్టుకి సమర్పించి ఆమె ప్రియుడు తీసాదంటూ తప్పుడు ఆరోపణలతో ఆమెపై నింద మోపాలని ప్రయత్నం చేశాడంటూ జునైద్ ఖాన్ విమర్శలు చేశారు. ఇండియాలో డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో అక్కడికి వెళ్ళాడు అంటూ ఆరోపణలు చేశారు.

తన అన్నలాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా ఉండడు అంటూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో జునైద్ ఖాన్ ఆ పోస్ట్ డిలేట్ చేశారు. అయితే అప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో అద్నాన్ సమీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరి తమ్ముడు జునైద్ చేసిన ఆరోపణలపై అద్నాన్ సమీ ఏమైనా రియాక్ట్ అవుతాడా అనేది చూడాలి.

More from Filmibeat

Read more about: adnan sami bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X