అక్షయ్ కుమార్‌పై సిద్దార్థ్ సెటైర్ల వర్షం.. డోనాల్డ్ ట్రంప్‌తో ఇంటర్వ్యూ!
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ని వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేయడం దగ్గర నుంచి, అక్షయ్ కుమార్ పౌరసత్వం వరకు అనేక వివాదాలు చెలరేగాయి. దీనితో అక్షయ్ కుమార్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా అక్షయ్ కుమార్ పై సెటైర్లు వేశారు.

డోనాల్డ్ ట్రంప్‌తో ఇంటర్వ్యూ
అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూపై సిద్దార్థ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. హే.. డోనాల్డ్ ట్రంప్.. మీకు ఓ సలహా.. ఈ సారి ఎన్నికలు ఎదుర్కొనే ముందు నాకో ఇంటర్వ్యూ ఇవ్వండి. మిమ్మల్ని మంచి ప్రశ్నలు అడుగుతాను. మీరు నిద్ర ఎలా పోతారు, ఎలాంటి పళ్ళు తింటారు.. మీ అందమైన శరీరం ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతానని సిద్ధార్థ్ అక్షయ్ కుమార్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అక్షయ్ కుమార్ ఇలాంటి ప్రశ్నలే మోడీని అడిగిన సంగతి తెలిసిందే.

ఇండియన్ పాస్ పోర్ట్ ఉంది
ఇక సిద్దార్థ్ మాట్లాడుతూ అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు. డోనాల్డ్ ట్రంప్.. నాకు ఇండియన్ పాస్ పోర్ట్ ఉంది.. నేరుగా సందేశం పంపండి అని సిద్దార్థ్ వ్యాఖ్యానించాడు. అక్షయ్ కుమార్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయలేదు. అక్షయ్ కుమార్ కు కెనడా పాస్ పోర్ట్ ఉండడంతో ఓటు అధికారాన్ని పొందలేకపోయారు.

ఇక్కడే టాక్సులు
ఈ వివాదంపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం నా పౌరసత్వం గురించి ఈ స్థాయిలో చర్చించడం అవసరమా అని అక్షయ్ తెలిపాడు. నాకు కెనడా పౌరసత్వం ఉన్న మాట వాస్తవమే. కానీ నా మాతృ దేశం ఇండియానే. గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా కెనడాకు వెళ్ళలేదు. నా టాక్సులన్నీ ఇండియా లోనే చెల్లిస్తున్నా అని అక్షయ్ తెలిపాడు.

రిటైర్ అయ్యాక ఇక్కడే
అక్షయ్ సమాధానానికి కౌంటర్ గా కొందరు నెటిజన్లు అతడి పాత వీడియోని బయటకు తీశారు. అందులో అక్షయ్ కుమార్ కెనడాలోని టొరంటో నగరంలో మాట్లాడుతూ.. టొరంటో నా సొంత ఊరు. బాలీవుడ్ నుంచి రిటైర్ అయ్యాక ఇక్కడకు వచ్చే సెటిల్ అవుతాను అని అక్షయ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీనితో దేశభక్తి విషయంలో అక్షయ్ కుమార్ రెండు కళ్ల సిద్దాంతం ఉపయోగిస్తున్నాడని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











