సీఎం పదవిని రిజెక్ట్ చేసిన నటుడు ఎవరో తెలుసా? అలా ఎందుకు చేశారంటే?
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్. ఆ నటుడు గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను ఆ నటుడు కరెక్ట్ గా సెట్ అవుతారు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా.. నిజ జీవితంలో సోనూ సూద్ రియల్ హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు,పేదలు ప్రాథమిక అవసరాలను తీర్చుతూ వారి పాలిట దేవుడుగా మారారు. ఈ క్రమంలో 'సోనూ ఫౌండేషన్' స్థాపించి, పేద ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. అయితే.. ఆయన రాజకీయాల్లో అడుగుపెడుతున్నారా? అనేది ఎప్పడు చర్చనీయమే.
సోనూసూద్ 'కల్లగర్' అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన 'అరుంధతి' సినిమాలో పశుపతి అనే విలన్ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ పాత్రతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పలు తెలుగు, తమిళ, కన్నడ తో పాటు హిందీలో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనూ సూద్ . ఈ క్రమంలో 'దబాంగ్', 'జోధా అక్బర్'తో పాటు పలు సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించకున్నారు.

అయితే.. కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం సోనూసూద్ చేశారు. తన పేరిట సోనూ సూద్ ఛారిటీ స్థాపించి ఎంతోమందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆడుకుంటున్నాడు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారాయన. ఈ నేపథ్యంలో హీరో సోనూ సూద్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ చాలా సార్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే నటుడు ఎప్పుడూ అలాంటి పుకార్లకు స్వస్తి పలికి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు.
రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతోనే ఆయన సామాజిక సేవ చేస్తున్నాడని చాలా వాదనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వాదనలు ఆరోపణలే అని పలుమార్లు నిరూపించబడ్డాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతున్నాడు సోనూసూద్. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం 'ఫతే' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్ సమయంలో ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని ప్రశ్నించగా.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు సోన్ సూద్.

ఫతే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోనీ సూద్ మాట్లాడుతూ.. నాకు సీఎం అయ్యే ఆఫర్ వచ్చింది. దాన్ని నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు. అది కాకపోతే.. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆఫర్ ఇచ్చారు. మీరు ఒకే అంటే.. నిన్ను రాజ్యసభకు తీసుకెళ్తాం అని చెప్పారు. ఆ ఆఫర్ ను కూడా నేను నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే.. జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు. అయితే..దానిని అంగీకరించి పైకి వెళ్లిన కొద్ది ఆక్సిజన్ తగ్గుతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది." అంటూ సోనూసూద్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు.
రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలపై సోనూసూద్ మాట్లాడుతూ.. చాలా రెండు విషయాల కోసం రాజకీయాల్లోకి వస్తారు. ఒకటి డబ్బు సంపాదించడం, రెండోది అధికారం కోసం. కానీ, నాకు అలాంటి అవసరాలు లేవు. ఏ ప్రలోభాలకు లోనుకాకుండా పని చేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో నేను ఎంత సుఖంగా ఉంటానో నాకే తెలుసు. కుల, భాష, మతంతో సంబంధం లేకుండా నా స్థాయిలో సహాయం చేస్తాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











