twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోను సూద్ రియల్ హీరో.. వలస కార్మికుల కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే.

    |

    దక్షిణాది, బాలీవుడ్ పరిశ్రమల్లో రాణిస్తున్న సోనుసూద్ మరోసారి మానవత్వం చాటుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఛిద్రమైన వలస కార్మికుల జీవితాలను తన భుజాన వేసుకొని మానవత్వాన్ని చాటుకొంటున్నారు. వలస కార్మికులు ఎండలో నడిచి వెళ్లకుండా బస్సులను ఏర్పాటు చేసి తమ స్వస్థలాలకు పంపిస్తున్న తీరుపై సోను సూద్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. తాను చేపట్టిన సేవ కార్యక్రమాలపై వస్తున్న స్పందన చూసి సోనూసూద్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..

    ఆకలి బాధలను చూసి

    ఆకలి బాధలను చూసి

    లాక్‌డౌన్ ఆరంభంలో ఆహారం అందని పేదలను ఆదుకోవాలని అనుకొన్నాను. పేదలకు ఆహార పంపిణి చేసి ఆకలిని తీర్చే ప్రయత్నం చేశాను. దాంతో చాలా మంది రోజువారి వేతన కార్మికులకు కాస్త ఊరట దక్కింది. కరోనా కారణంగా కూలీలు, వేతన కార్మికుల పరిస్థితి చూసి నాకు ఆవేదన కలిగించింది అని సోను సూద్ తెలిపారు.

    ఏ ఒక్క కార్మికుడు కూడా

    ఏ ఒక్క కార్మికుడు కూడా

    తాజాగా జాతీయ మీడియాతో సోను సూద్ మాట్లాడుతూ.. ఏ ఒక్క వలస కార్మికుడు కూడా ఎండలో నడిచి వెళ్లకూడదని భావించా. పేపర్లో, టెలివిజన్‌లో వలస కార్మికులు రోడ్లపై నడిచి వెళ్లే దృశ్యాలు నాకు ఆవేదన కలిగించాయి. దాంతో వారికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వారిని వాహనాల్లో తరలించే కార్యక్రమాన్ని చేపట్టాను అని అన్నారు.

    పబ్లిసిటీ దూరంగా

    పబ్లిసిటీ దూరంగా

    పబ్లిసిటీకి దూరంగా నేను సేవ కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రతీ వలస కార్మికుడు ఇంటికి చేరే వరకు నా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరి వలస కార్మికుడి సంతోషమే నాకు తప్తిని కలిగిస్తుంది. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎంతైనా భరిస్తాను. అందుకు నేను ఎంతవరకైనా ముందుకు వెళ్తాను అని సోను సూద్ పేర్కొన్నారు.

    చాలా కష్టాలు పడ్డాను

    చాలా కష్టాలు పడ్డాను

    వలస కార్మికుల తరలింపు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వలస కార్మికులు నిరక్షరాస్యులు కావడంతో చాలా సమస్యలు తలెత్తాయి. లీగల్‌గా డాక్యుమెంట్లు తయారు చేయాల్సి వచ్చింది. కార్మికులను తరలించడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకొన్నాం. ఇలాంటి కష్టాలు నా ప్రయత్నాలకు అడ్డుపడలేదు అని సోనుసూద్ తెలిపారు.

    English summary
    Actor Sonu Sood helping migrant workers. He said, I will continue my work until every migrant worker reaches their home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X