చావుబతుకుల్లో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసిన సోనుసూద్.. గుండె తరుక్కుపోవడం ఖాయం!
సోనూసూద్ అంటే ప్రస్తుతం ఇండియా మొత్తానికి ఒక రియల్ హీరో అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి వ్యక్తి సహాయం కోసం వచ్చినా కూడా లేదనకండా కాదనకుండా తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా సోనూసూద్ నిర్విరామంగా తన సహాయలను కొనసాగిస్తున్నారు.
ఇప్పటివరకు ఎన్నో కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. ఇక సోనూసూద్ చేస్తున్న పనులకు చాలామంది సినీ ప్రముఖులు కూడా తమవంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఇక ఇటీవల చావుబతుకుల్లో ఉన్న వ్యక్తికి సోనూసూద్ ప్రాణం పోశాడు. ఇక బాధితుడు సోనూసూద్ ను ప్రత్యేకంగా కలుసుకుంటు కృతజ్ఞతలు చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మల్లికార్జున అనే వ్యక్తి గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక సోనూసూద్ అతనికి హార్ట్ సర్జరీ చేయించి ప్రాణం పోశాడు. మల్లిఖార్జునతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా సోనూసూద్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇక సోనూసూద్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కంటిన్యూగా సహాయలు కూడా చేస్తున్నాడు. ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఎప్పుడైతే సోనూసూద్ సహాయలు చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ట్విట్టర్ లో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్స్ అందించాలని ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా నిర్మించారు. దీంతో ఆయన ట్విట్టట్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఇటీవల 8 మిలీయన్ ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్నాడు.


Click it and Unblock the Notifications











