అశ్రునయనాల మధ్య సుశాంత్ అస్థికల నిమజ్జనం, కన్నీటితో చివరి వీడ్కోలు.. 5 ఏళ్ల మేనకోడలు..!
సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానుల మధ్య భావోద్వేగ అంశాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అశ్రు నయనాల మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించిన ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం తమ స్వంత పట్టణంలో సుశాంత్ అస్థికలను నిమజ్జనం చేయడానికి పాట్నాకు చేరుకొన్నారు. ఈ సందర్బంగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కృతి ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ..
Recommended Video

భౌతికంగా దూరమైనప్పటికీ..
సుశాంత్ మరణం తర్వాత సోదరి శ్వేత సింగ్ స్పందిస్తూ.. మా ప్రియాతిప్రియమైన సోదరుడు భౌతికంగా మనతో లేరనే విషయం నాకు బాధగా ఉంది. అయితే నీవు గుండెలో బాధ ఉందనే విషయం తెలుసు. నీవు వాటిని ఎదురించే ఫైటర్ అని తెలుసు. నీకు ఎదురైన సంఘటనలను సమర్ధంగా ఎదురిస్తున్నట్టు తెలుసు. కానీ మరీ ఎక్కువ బాధ అనుభవిస్తున్నావనే విషయాన్ని తెలుసుకోలేకపోయాం. ఒకవేళ మా సంతోషాలు నీకు ఇచ్చి.. నీ బాధలను మేపు పంచుకొంటే చిరకాలం నీవు మాతోనే ఉండేవాడివేమో అని సోదరి తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

చిరకాలం మీ ప్రేమానురాగాలు..
మా సోదరుడి అస్థికల నిమజ్జనం చేయడానికి పాట్నాలోని మా స్వంత ఇంటికి బుధవారం చేరుకొన్నాం. సుశాంత్ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ప్రశాంతంగా ముగించడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి మా కుటుంబ తరఫున ధన్యవాదాలు. సుశాంత్‌పై ప్రేమానురాగాలు, అతడితో ఉన్న మెమొరీస్‌ను మీ గుండెల్లో చిరకాలం దాచుకోవాలని, అతడి ఆత్మ శాంతికి ప్రార్థించాలి. అతడి జీవితం సంపూర్ణంగా ముగియడానికి ప్రేమతో కన్నీటి వీడ్కోలు తెలుపుదాం అని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ తన పోస్టులో కోరారు.

గంభీరమైన పరిస్థితుల మధ్య
కాగా, గురువారం ఉదయం సుశాంత్ సింగ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ముగించినట్టు తెలిసింది. పాట్నాలోని తన స్నేహితులు, బంధువులు తరలి రావడంతో అక్కడ పరిస్థితి భావోద్వేగంగా, గంభీరంగా మారిందనే విషయాన్ని తెలిపారు. పలువురి భావోద్వేగాలు, అశ్రునయనాల మధ్య సుశాంత్ అస్థికల నిమజ్జనాన్ని సంప్రదాయ పద్దతుల్లో ముగించినట్టు బంధువులు తెలిపారు.

మేన కోడలు స్పందించిన తీరు
ఇదిలా ఉండగా, సుశాంత్ మరణంపై 5 ఏళ్ల మేనకోడలు స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామ ఇక లేరూ అంటూ శ్వేత సింగ్ తన కూతురుకు చెబితే.. మామ ఎక్కడికి వెళ్లలేదు. మన హృదయాల్లో సజీవంగా ఉంటారు అని స్వచ్ఛమైన మనసుతో చెప్పిన విషయం అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











