Don't Miss!
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Sports
ఆయన వల్లే ఫైనల్‌కు చేరాం.. నా సత్తా మొత్తం బయటికి తీసాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Katrina Kaif ఇంటిలో వీకి కౌశల్.. పెళ్లికి ముందే మీడియాకు అలా పట్టుబడ్డ ప్రేమ జంట!
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ కత్రినా కైఫ్, వికీ కౌశల్ డేటింగ్, ప్రేమ వ్యవహారం గత కొద్దికాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతున్నది. ఇలాంటి వ్యవహారాల మధ్య పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. వారిద్దరి పెళ్లి వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తమ పెళ్లికి ముందు కత్రినా, వికీ కౌశల్ ఇద్దరు మీడియా కంట పడ్డారు. ఇటీవల కత్రినా కైఫ్ ఇంటిలో కొంత సమయాన్ని గడిపి వెళ్తున్న సమయంలో వికీ కౌశల్ మీడియా కెమెరాలకు చిక్కాడు. కత్రినా కైఫ్ ఇంటి నుంచి రేంజ్ రోవర్ కారులో బయటకు వెళ్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
గతంలో కూడా కత్రినా కైఫ్ నివాసంలో వికీ కౌశల్ ఉండటం పలు మార్లు మీడియా దృష్టికి వచ్చింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వారిద్దరూ ఒకే ఇంటిలో సహజీవనం చేయడం తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరు కరోనావైరస్ బారిన పడ్డారు. ఇలా వారి రొమాంటిక్ లైఫ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి.

ఇదిలా ఉండగా, కత్రినా కైఫ్, వికీ కౌశల్ త్వరలోనే పెళ్లి జరుగుతుందనే వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. 2021 డిసెంబర్ 9వ తేదీన వీరద్దరి పెళ్లి జరుగుతుందనే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వికీ, కత్రినా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి ముందు పనుల కారణంగా షూటింగులకు హాజరు కావొద్దని కత్రినా నిర్ణయం తీసుకొన్నారు. ముంబైలో కోర్టు మ్యారేజ్‌గా వీరిద్దరి వివాహ వేడుక జరుగుతుందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వికీ కౌశల్, కత్రినా కైఫ్ కెరీర్ విషయాలకు వస్తే... కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ఫోన్ బూత్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. వికీ కౌశల్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ, సర్దార్ ఉద్దమ్ సింగ్, అలాగే సామ్ మానిక్ షా బయోపిక్‌లో నటిస్తున్నారు.