»   »  రేప్ కేసు పెట్టిన ప్రముఖ నటి, ముంబై బిజినెస్‌మేన్ అరెస్ట్

రేప్ కేసు పెట్టిన ప్రముఖ నటి, ముంబై బిజినెస్‌మేన్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actress Zeenat Aman Filed A Complain Against Businessman

ప్రముఖ బాలీవుడ్ నటి, 70, 80ల్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా, గ్లామర్ లేడీగా పేరుగాంచిన జీనత్ అమన్ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ మీద జుహు పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం...ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు బిజినెస్‌మేన్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

 పోలీసులు ఏమన్నారంటే..

పోలీసులు ఏమన్నారంటే..

‘గురువారం రాత్రి తమకు జుహు పోలీస్టేషన్లో ఫిర్యాదు అందిందని, వెంటనే నిందితుడిని అరెస్టు చేశాం, శుక్రవారం లోకల్ కోర్టులో ప్రవేశ పెట్టాం. ఈ కేసును ప్రస్తుతం క్రైమ్ బ్రాంచికి బదిలీ చేశాం. దర్యాప్తు జరుగుతోంది' అని డిసిపి నిసార్ తంబోలి తెలిపారు.

 నిందితుడు

నిందితుడు

నిందితుడిని 38 ఏళ్ల సర్ఫరాజ్‌గా గుర్తించారు. ఇతడిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇతడు తనను చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు 66 ఏళ్ల జీనత్ అమన్ ఆరోపిస్తున్నారు.

 మీడియా రిపోర్ట్స్

మీడియా రిపోర్ట్స్

మీడియా రిపోర్ట్స్ ప్రకారం.... 2011 నుండి 2015 మధ్య సర్ఫరాజ్... జీనత్ అమన్‌కు చెందిన రూ. 15 కోట్ల విలువ చేసే నగలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. నగలు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో ముంబైలో ఆమె పేరు మీద ఉన్న 5 ప్లాట్లు ఫోర్జరీ పేపర్లు క్రియేట్ చేసి తన పేరున రాయించుకున్నట్లు సమాచారం.

పెళ్లి జరిగినట్లు ఫేక్ పేపర్స్

పెళ్లి జరిగినట్లు ఫేక్ పేపర్స్

ఫేక్ మ్యారేజ్ పేపర్లు క్రియేట్ చేసి... తన గురించి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బెదిరింపులకు పాల్పడ్డట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అతడిపై ఐపిసీ 376, 420, 406, 465, 467, 468, 469, 471, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు మిర్రర్ నౌలో రిపోర్ట్స్ వచ్చాయి.

English summary
A Mumbai businessman was arrested Thursday (March 22) night after a veteran Bollywood actress accused him of rape and filed a complaint against him at Juhu Police Station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X