మూవీ మాఫియా లెక్కలు.. ఆలియా భట్ సినిమా కలెక్షన్స్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నెంబర్లు అనేవి మారుతూనే ఉంటాయి. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం ఇండస్ట్రీలో కావాలని వారి కలెక్షన్స్ ను ఎక్కువగా చూపించుకుంటున్నారు అని ఇండస్ట్రీలో వారే చెబుతున్నారు. ఇక కంగనా రనౌత్ తరచుగా ఇండస్ట్రీలో వివాదస్పద విషయాలపై ఏ రేంజ్ లో స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మూవీ మాఫియా లెక్కలు అంటూ రీసెంట్ గా అలియా భట్ గంగూబాయ్ ఖతియావాడి సినిమా కలెక్షన్స్ ను కూడా టార్గెట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గంగూబాయ్ ఖతియావాడి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు కంగనా రనౌత్ ఏ విధంగా కామెంట్స్ చేసింది అనే వివరాల్లోకి వెళితే...

ఈసారి సినిమా కలెక్షన్స్ పై..
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా నిత్యం ఏదో వార్తతో హాట్ టాపిక్ గా నిలిచే కంగనా రనౌత్ ఈసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ పై టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో నెపోటీజమ్ పై అలాగే క్యాస్టింగ్ కౌచ్ పై అందరికంటే వేగంగా స్పందించిన విధానం ఆశ్చర్యానికి గురి చేసింది ఇండస్ట్రీలో తప్పు జరిగితే వెంటనే కంగనా రనౌత్ పాత విషయాలను బడా స్టార్స్ పేర్లను కూడా చాలా ఈజీగా ఇన్ డైరెక్ట్ గా బయట పెడుతోంది.

ఫైట్.. నాకు వాళ్ళకి మధ్యలో కాదు..
ఇక ఇప్పుడు కంగనా రనౌత్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో అలియా భట్ హీరోయిన్ గా నటించిన గంగూభాయ్ ఖతియావాడి సినిమా కలెక్షన్స్ ను కూడా టార్గెట్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది. ఈసారి దాకడ్ సినిమాతో కంగనా రనౌత్ తన సొంత రికార్డును బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నట్లుగా కంగనా సోదరి రాంగోలి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక ఆమె అలా పోస్ట్ చేయగానే కంగనా ఈ విధంగా స్పందించింది. ఫైట్ నాకు వాళ్ళకి మధ్యలో కాదు. ఇక్కడ సిస్టమ్, రాకెట్, మాఫియా, పేయిడ్ PR కూడా రియల్ టాలెంట్ ను హానేస్ట్ వర్క్ ను బీట్ చేయలేరు అని కంగనా తెలియజేసింది.

మాఫియా మ్యాథమెటిక్స్..
మరొక పోస్ట్ లో రాంగోళి కంగనా 'మణికర్ణిక' గురించి మాట్లాడింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో మనికర్ణిక ఒకటి అని చెప్పింది. ఇక అప్పట్లో కొన్ని బడా చిత్రాలతో మనికర్ణిక సినిమా గట్టి పోటీని ఇచ్చింది. ఇక ఆ పోస్ట్‌పై కంగనా స్పందిస్తూ, మూవీ మాఫియా మ్యాథమెటిక్స్... 75 కోట్ల సినిమా మూడు రోజుల్లో 43 కోట్లు చేస్తే అల్ట్రా డిజాస్టర్ అంటారు... 160 కోట్ల సినిమా 35 కోట్లు చేస్తే దాన్ని సూపర్ హిట్" అని అంటరాని పేర్కొంది.

గంగుభాయ్.. బాక్సాఫీస్ కలెక్షన్స్
ఇక అలియా భట్ గంగూభాయ్ ఖతియావాడి సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ వీకెండ్ లో సినిమా సాలీడ్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ముంబై, తానే, పూణే, గుజరాత్, ఢిల్లీ.. ఇలా పలు ముఖ్యమైన ఏరియాల్లో కలెక్షన్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక శుక్రవారం 10.50కోట్లు రాగా శనివారం అంతకంటే ఎక్కువగా 13.32కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం 15.30కోట్లు దక్కించుకున్న గంగూభాయ్ మూడు రోజుల్లో 39.12కోట్లు రాబట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











