ఇంటికి పిలిచి పోర్న్ చూపించాడు.. రూమ్‌లోకి వెళ్లి నేను చెప్పినట్లు చేస్తే.. బరితెగించిన డైరెక్టర్!

మీటూ ఉద్యమంతో బాలీవుడ్ దర్శకుల బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి. హీరోయిన్లని వేధించిన వారి జాతకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాలీవుడ్ లో పలువురు నటీమణులు తనకు ఎదురైన చేదు అనుభవాలని ధైర్యంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ సింగర్ చిన్మయి తనకు జరిగిన లైంగిక వేధింపులని బయట పెట్టడమే కాక, తనకు పరిచయం ఉన్న ఇతర నటీమణులకు, హీరోయిన్లకు జరిగిన వేధింపులని సోషల్ మీడియా వేదికగా బయటపెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికి బాలీవుడ్ సుభాష్ కపూర్, షాజిద్ ఖాన్, లవ్ రాజన్, వికాస్ బహల్ వంటి దర్శకులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి మరో ప్రముఖ దర్శకుడు కూడా చేరారు.

ఆమె నాకు వివరించింది

ఆమె నాకు వివరించింది

శ్రీలంక క్రికెటర్ మలింగా ఓ యువతిని వేధించగా.. ఆ సంఘటనని ఆమె తనతో చెప్పిందని చిన్మయి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తనకు తెలిసిన ఓ నటి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సౌమిక్ సేన్ నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొందని చిన్మయి ట్వీట్ చేసింది.

 ఫేస్ బుక్‌లో పరిచయమై

ఫేస్ బుక్‌లో పరిచయమై

ఆ నటి చిన్మయికి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అప్పటికే గులాబ్ గ్యాంగ్ చిత్రంతో సౌమిక్ సేన్ దర్శకుడిగా పాపులర్ అయ్యారు. నేను నటిగా బాలీవుడ్ లో అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నా. ఓ రోజు అనుకోకుండా ఆయన నాకు పేస్ బుక్ లో పరిచయం అన్నారు. గులాబ్ గ్యాంగ్ చిత్ర దర్శకుడు అని తెలియడంతో నాలో ఆశలు చిగురించాయి.

లెస్బియన్‌గా ఓకేనా

లెస్బియన్‌గా ఓకేనా


దర్శకుడు అని తెలియడంతో చాట్ చేశాను. నా తదుపరి చిత్రంలో నటిస్తావా అని అడిగాడు. నాలో ఆశలు పెరిగి అతడికి నా ఫోన్ నెంబర్ ఇచ్చా. ఫోన్ లో మాట్లాడాడు. నా వాయిస్ చాలా బావుందని ప్రశంసించాడు. నిన్ను సెక్సీగా చూడాలి అని అన్నాడు. కేవలం హీరోయిన్ గా మాత్రమే చేస్తావా లేక లెస్బియన్ చిత్రంలో నటిస్తావా అని అడిగాడు.

అసభ్యంగా మాట్లాడినా

అసభ్యంగా మాట్లాడినా

అసభ్యంగా ఎన్ని మాటలు మాట్లాడినా అవకాశం ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో లెస్బియన్ చిత్రానికి అంగీకరించా. మా ఇంటికి రా ఒకసారి కలసి మాట్లాడుదాం అని పిలిచాడు. అక్కడి నుంచి నాకు అసలైన వేధింపులు మొదలయ్యాయి.

పోర్న్ చూస్తావా


ఇంటికి వెళ్ళగానే.. ఎందుకు ఒంటినిండా బట్టలు కప్పుకుని వచ్చావు అని అడిగాడు. ఇలాగైతే నేను నిన్ను సెక్సీగా చూపించలేను. ఇక వయ్యారంగా ఒకసారి క్యాట్ వాక్ చేసి చూపించు అని అడిగాడు. అతడు నీచమైన మాటలు భరిస్తూ చెప్పినట్లు చేశాను. ఆ తరువాత సినిమా గురించి చెప్పండి అని అడిగాను. నువ్వు పోర్న్ చూస్తావా అని కూడా అడిగాడు.

నా దగ్గరకు తీసుకుని వచ్చి

నా దగ్గరకు తీసుకుని వచ్చి

లాప్ ట్యాప్ నా దగ్గరకు తీసుకుని వచ్చి నీచంగా ప్రవర్తించాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది అంటూ నామీద చేతులు వేశాడు. నేను సున్నితంగా తిరస్కరించా. నాకు శృంగారం చేయాలనీ లేదు. దయచేసి సినిమా గురించి మాట్లాడండి అని అడిగా.

రూమ్‌లోకి వెళ్లి అలా చేయమని

రూమ్‌లోకి వెళ్లి అలా చేయమని


అతడి ప్రవర్తనని చివరకు దారుణంగా మారింది. కనీసం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వు అని అడిగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నా. ఆ తరువాత బ్రతిమిలాడడం మొదలు పెట్టాడు. ఆ రూమ్ లోకి వెళ్లి మాస్టర్బెషన్ చేయి.. నా తదుపరి చిత్రంలో నీకు అవకాశం ఉంటుంది అని అడిగాడు. అతడి ప్రవర్తన శృతిమించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయా అని ఆ నటి చిన్మయికి వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X