పట్టపగలే నటి ఇంట దారుణం.. ఒంటరిగా ఉన్నప్పుడు కత్తి చూపి అలా!

2014 సంవత్సరంలో మిస్ ఇండియా ఎర్త్ అందాల పోటీలో విజేతగా నిలిచిన మోడల్ మరియు నటి అలంకృత సహాయ్ దోపిడీకి గురయ్యారు. చండీగఢ్‌లోని ఆమె అద్దె ఇంట్లో అలంకృతకు జరిగిన ఈ ఘటనలో ఆమెను బందీగా పట్టుకుని కత్తి చూపించి మరీ దోపిడీ దొంగలు ఆమెను దోచుకున్నారు. ఈ సంఘటన తర్వాత, అలంకృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

కత్తితో బెదిరించి

కత్తితో బెదిరించి

నటి మరియు మోడల్ అలంకృత సహాయ్ ను దోచుకున్న సంఘటనకు సంబంధించి వార్తలు వెలుగులోకి వచ్చాయి. అందుతున్న సమాచారం మేరకు ముగ్గురు దొంగలు నటి ఇంట్లోకి ప్రవేశించారు. ఈ ముగ్గురు దొంగలు నటిని కత్తితో బెదిరించి ఆరున్నర లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ దోపిడీ సంఘటన మంగళవారం, సెప్టెంబర్ 7న జరిగింది.

ఆరున్నర లక్షల రూపాయలు

ఆరున్నర లక్షల రూపాయలు

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముగ్గురు మాస్క్‌లు ధరించిన వ్యక్తులు రెండో ఫ్లోర్‌లోని తన ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించారని అలంకృత చెప్పారు. ఆ తరువాత, వారు అలంకృతను కత్తితో భయపెట్టి సుమారు ఆరున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారని ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అరిస్తే చంపేస్తామని

అరిస్తే చంపేస్తామని

అలంకృత ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఇటీవల ఆమె కొంత ఫర్నిచర్ కొనుగోలు చేసిందని, అది ఆదివారం డెలివరీ చేయబడిందని చెప్పారు. ఫర్నిచర్ డెలివరీ చేస్తున్న సమయంలో దొంగలలో ఒకరు తన ఇంటికి వచ్చి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె ఏటీఎం కార్డు తీసుకెళ్లి రూ.50 వేలు విత్‌డ్రా చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అలంకృతను బంధించి, అరిస్తే చంపేస్తామని బెదిరించారు.

అలంకృత ఒంటరిగా

అలంకృత ఒంటరిగా

అంతేకాదు ఇంట్లో ఉన్న నగలు, నగదును కూడా తీసుకెళ్లారు. మొత్తంగా దాదాపు ఆరున్నర లక్షల వరకు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. 50 వేల రూపాయలు విత్‌డ్రా చేసిన తర్వాత దొంగలు ఆమె ATM కార్డును తీసుకొని తిరిగి ఇచ్చారని అలంకృత చెప్పింది. సంఘటన జరిగినప్పుడు అలంకృత ఒంటరిగా ఉంది మరియు ఆమె తల్లిదండ్రులు సుమారు 10 రోజులుగా పట్టణంలో లేరు.

Recommended Video

Prakash Jha Made Me Uncomfortable While Filming Lipstick Under My Burkha Scene || Filmibeat Telugu
భయంతో వణికి పోయి

భయంతో వణికి పోయి

2014 సంవత్సరంలో, నటి అలంకృత సహాయ్ మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. ఇది కాకుండా, ఆమె "లవ్ పెర్ స్క్వేర్ ఫుట్" మరియు నమస్తే ఇంగ్లాండ్ సినిమాల్లో కూడా నటించింది. ఇవి కాకుండా అలంకృత అనేక పెద్ద మ్యూజిక్ వీడియోలలో కూడా పని చేసింది. ఈ మొత్తం సంఘటన తర్వాత నటి చాలా భయపడింది. ఈ మొత్తం కేసులో పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇస్తూ, దొంగలు నటి గదిని జల్లెడ పడ్డారని మరియు సుమారు ఆరు లక్షల నగదును దోచుకున్నారని చెప్పింది. ఆమె ఢిల్లీ నివాసి అయినప్పటికీ, ఆమె 1 నెల క్రితం చండీగఢ్‌కు మారింది. ఇక సీసీ కెమెరాలో దొంగల ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు వారి కోసం వెతుకుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X