అమీషా పటేల్ మీద చీటింగ్ కేసు నమోదు

పవన్ కళ్యాణ్ మూవీ 'బద్రి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా పటేల్ అవకాశాలు తగ్గి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆమెపై చీటింగ్ కేసు నమోదు కావడంతో మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అమీషా మీద లా సూట్ దాఖలు చేసింది. ఓ పెళ్లి వేడుకలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తానని డబ్బులు తీసుకున్న అమీషా తమను మోసం చేసినట్లు కేసు వేశారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అమీషా పటేల్‌తో పెళ్లి వేడుకలో నృత్య ప్రదర్శన చేయడానికిగాను నవంబర్ 2016లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఆమెకు రూ. 11 లక్షలు చెల్లించారు.

Actress Ameesha Patel has landed in legal trouble

అమీషా పటేల్ తన బృందంతో కలిసి వచ్చి నృత్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా... అదనంగా మరో రూ. 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకుడు పవన్ శర్మ అంగీకరించక పోవడంతో ప్రదర్శన ఇవ్వకుండానే అమీషా పటేల్ ముంబై వెళ్లిపోయింది.

దీని వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే తమను బెదిరిస్తోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు అమీషాతో పాటు మరో నలుగురిపై కేసు నమెదు చేశారు. మార్చి 12లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X