ఆరేళ్ల వయసులో నాపై అత్యాచారం, అతడి పేరుతో సహా వెల్లడించిన ప్రముఖ నటి!

By Bojja Kumar

Recommended Video

అత్యాచారం చేసి బెల్టుతో తీవ్రంగా కొట్టారు ,60 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన భయంకర సంఘటన

ప్రముఖ బాలీవుడ్ సినీయర్ నటి డైసీ ఇరానీ తాజాగా ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. తనపై ఆరేళ్ల వయసులోనే అత్యాచారం జరిగిందని, తనకు గార్డియన్‌గా నియమింపబడిన వ్యక్తే తనను రేప్ చేశాడని ఆమె తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్‌కు డైసీ ఇరానీ స్వయానా పెద్దమ్మ. అత్యాచారం జరుపడంతో పాటు బెల్టుతో తీవ్రంగా కొట్టాడని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ఈ విషయాలను ఆమె ముంబై మిర్రర్‌ అనే ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

మద్రాసులో జరిగింది

మద్రాసులో జరిగింది

‘హమ్ పంచీ ఏక్ దాల్ కే' షూటింగ్ కోసం మద్రాసు(చెన్న) వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు గార్డియన్‌గా ఓ వ్యక్తిని నిమయించారు. అతడే ఓ రోజు రాత్రి హోటల్ రూములో నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత బెల్టుతో తీవ్రంగా కొట్టి ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించారు... అని డైసీ ఇరానీ తెలిపారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

60 ఏళ్ల తర్వాత విషయం బయట పెట్టిన డైసీ ఇరానీ

60 ఏళ్ల తర్వాత విషయం బయట పెట్టిన డైసీ ఇరానీ

ఈ భయంకర సంఘటన గురించి 60 ఏళ్ల తర్వాత ఆమె బయట పెట్టారు. తనపై ఈ ఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పేరు డైసీ ఇరానీ తెలిపారు. అతడు ఇప్పటికే మరణించాడు.

 అతడి పేరు నాజర్

అతడి పేరు నాజర్

ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు. అతడి పేరు నాజర్. ఫేమస్ సింగర్ జోహ్రాభాయి అంబలేవాలికి బంధువు. అతడికి సినిమా ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉండేవి. నా తల్లి నన్ను స్టార్‌ను చేయడానికి చాలా నరకం అనుభవించింది. బేబీ అనే మరాఠీ మూవీ ద్వారా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ‘హమ్ పంచీ ఏక్ దాల్ కె' షూటింగ్ మద్రాసులో జరుగుతుండగా నాకు తోడుగా అంకుల్ నాజర్ వచ్చారు. ఆ సంఘటన తర్వాత అతడి బెదిరింపులతో చాలా భపడిపోయాను. మరుసటిరోజు ఏమీ జరుగనట్లే స్టూడియోకు వచ్చాను. చాలా సంవత్సరాల పాటు ఈ విషయం నా తల్లికి చెప్పడానికి కూడా భయ పడ్డాను అని డైసీ ఇరానీ తెలిపారు.

 డైసీ మాత్రమే కాదు...ఈ బాలీవుడ్ స్టార్లు కూడా

డైసీ మాత్రమే కాదు...ఈ బాలీవుడ్ స్టార్లు కూడా

డైసీ ఇరానీ మాత్రమే కాదు... చాలా మంది బాలీవుడ్ తారలు బాల్యంలో లైంగిక వేధింపులకు గురయ్యారు. 13 ఏళ్ల వయసులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా పబ్లిక్ ప్లేసులో సోనమ్ కపూర్, ఆరేళ్ల వయసులో లిఫ్ట్ మ్యాన్ ద్వారా అక్షయ్ కుమార్ వేధింపులకు గురయ్యారు. మరో నటి కల్కి కోచ్లిన్ 9 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగినట్లు గతంలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X