రెండో భర్తతోనూ గొడవలు... పెళ్లైన ఏడాదికే విడాకులు! పాపం ఈ నటి పరిస్థితేంటో?
ఫిల్మ్ ఇండస్ట్రీలో డివొర్స్ సర్వసాధారణ విషయం అయిపోయిన సంగతి తెలిసిందే. పరిస్పర అంగీకారం అంటూ ఓ రెండు పదాలను చెప్పేసి విడాకులు తీసేసుకుంటున్నారు పలువురు సెలబ్రిటీ కపుల్స్. రీసెంట్గా కూడా బాలీవుడ్ హీరోయిన్ ఈషా దేఓల్ 12ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తన భర్తతో విడాకులు తీసుకుని షాక్ ఇచ్చింది. అలా ఇప్పుడు మరో నటి కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈమె అయితే మరీ పెళ్లైన ఏడాది కూడా అవ్వలేదు. ఇప్పుడు డివొర్స్కు సిద్ధమైనట్లు తెలిసింది. దాని గురించే ఈ కథనం..
చిత్ర సీమలో మరో కపుల్ విడిపోవడానికి సిద్ధమైందని తెలిసింది. ప్రస్తుతం ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు! ఇంతకీ ఆమె ఎవరంటే.. స్మాల్ స్క్రీన్‌పై చూపులు కలిసిన శుభవేళ ధారావాహిక మంచి విశేష ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్‌ను తెలుగులోనూ డబ్ చేసి ప్రసారం చేయగా ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ ధారావాహికలో నటించిన దల్జీత్ కౌర్ మన తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

అయితే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దల్జీక్కు వ్యక్తిగత జీవితం మాత్రం సజావుగా ముందుకు సాగడం లేదు. వైవాహిక జీవితంలో ఎన్నో ఒదుదొడుకులను ఎదుర్కొంటోంది. ఆమె ఇప్పటికే నటుడు షాలిన్ బానోత్‌ను వివాహమాడి విడాకులు తీసుకుంది. 2009లో వీరిద్దరికి పెళ్లి జరగగా.. జైడన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థలతో 2013లో డివొర్స్ తీసుకున్నారు.
ఆ తర్వాత కొంతకాలం తన కుమారుడితో ఒంటరిగా జీవించింది దల్జీత్ కౌర్. అనంతరం దుబాయ్‌లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అయితే నిఖిల్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ అతడు కూడా భార్యకు డివొర్స్ ఇచ్చి విడిగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం లండన్‌లో సెటిల్ అయిన వీరు ప్రస్తుతం విడిపోయారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. రీసెంట్‌గానే తన కొడుకు జైడన్తో కలిసి తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలను డెలీట్ చేసింది. ఇన్‌స్టాలో బయోలో ఇంటి పేరును తొలగించింది. దీంతో వీరిద్దరి డివొర్స్ తీసుకున్నారనే వార్తకు మరింత బలం చేకూరినట్టైంది. నిఖిల్ కూడా సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోస్‌ను తొలిగించారు.
ఈ సమయంలోనే దల్జీత్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ఓ నోట్ షేర్ చేశారు. దల్జీత్ తండ్రికి సర్జరీ చేయాల్సి ఉందని, అందుకే ఆమె తన కొడుకుతో ఇండియాకు వచ్చిందని అన్నారు. తమ కుటుంబంతో దల్జీత్ ఉండడం చాలా ముఖ్యమని అందులో రాసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఆమె దేనీ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగించవచ్చు అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో దల్జీత్, నిఖిల్ విడాకుల విషయం నిజమేనని అంతా ఫిక్సైపోయారు. పెళ్లై ఏడాది కాక ముందే ఇద్దరు విడిపోవడంతో అంతా షావుతున్నారు.


Click it and Unblock the Notifications











