Don't Miss!
- News
వైసీపీ పొరబాటున మళ్లీ గెలవకపోతే..! ఏం జరుగుతుందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి..
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Finance
Adani Stocks: రెడ్ జోన్లో అదానీ స్టాక్స్.. హిండెన్‌బర్గ్ నివేదికతో కోట్లు ఆవిరి..
- Lifestyle
లావాటి పర్సును వెనక జేబులో పెట్టుకుంటున్నారా? వెంటనే ఆ అలవాటు మానుకోండి
- Sports
సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: శుభ్‌మన్ గిల్
- Technology
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Besharam సాంగ్ లో దీపిక రెచ్చిపోవడానికి కారణమిదే.. నిర్మాతలు అడిగినంత డబ్బు ఇవ్వడంతో..
షారుక్ ఖాన్ దీపిక పదుకొనే జంటగా నటిస్తున్న పటాన్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ విడుదల చేయడంతో అది ఒక్కరోజులోనే భారి స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక వీడియో సాంగ్ లో అయితే దీపిక పదుకొన్ గతంలోనే ఎప్పుడు లేనంత హాట్ గా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ బికినీలో కనిపించేందుకు ఆమె ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

లిప్ లాక్ సన్నివేశాలతో
గ్లామరస్ హీరోయిన్ దీపిక పదుకొన్ రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గ్లామరస్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వేనుకకడుగు వేయడం లేదు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా గ్లామర్ తో హీటెక్కిస్తోంది. ఆ మధ్య గెహరియన్ సినిమాలో ఆమె ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో ఫస్ట్ నైట్ సీన్స్ తో కూడా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అమ్మడు ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేసింది.

పెళ్లి తరువాత..
అయితే ఇప్పుడు పఠాన్ బేషరం పాటలో కూడా ఆమె మతిపోయే బికినీ అందాలతో దర్శనమిచ్చింది. గతంలో కూడా దీపిక పదుకొన్ బికినీ అందాలతో కనిపించింది కానీ ఈ రేంజ్ లో అయితే షాక్ ఇవ్వలేదు అని నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయిలో పెర్ఫామెన్స్ ఇస్తుంది అంటే నిజంగా గ్రేట్ అని కూడా మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

నెగిటివ్ ట్రోల్స్
షారుక్ ఖాన్ తో ఆమె నటించిన విధానం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బేషరం సాంగ్ లో బికినీ అందాలతో ఆమె కొన్ని మూమెంట్స్ లో అయితే చాలా హీటెక్కించింది. ఇక ఆమె బికినీ అందాలపై షారుక్ ఖాన్ చేయి పెట్టిన విధానం కూడా చాలా ఘాటుగా ఉంది అని కూడా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది మరి టూమచ్ గా ఉంది అని.. అందుకే ఈ సినిమాను బాయికాట్ చేయాలి అంటూ మరికొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

దీపిక అందాల ఆరబోత
ఏదేమైనా కూడా బేషరం సాంగ్ ద్వారా పఠాన్ సినిమాపై మళ్ళీ ఒక్కసారి అంచనాలు పెరిగిపోయాయి. 2023 జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అసలే సక్సెస్ లేక సతమతమవుతున్న షారుఖ్ ఖాన్ ఈ సినిమా ద్వారా ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు దీపిక అందాల ఆరబోత మెయిన్ హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

అత్యధిక రెమ్యునరేషన్
అయితే ఈ సాంగ్ లో బికినీ లో పెర్ఫామెన్స్ ఇవ్వడానికి దీపిక పదుకొనే భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంతకుముందు పది నుంచి పన్నెండు కోట్ల రేంజ్ లో ఒక్కో సినిమాకు పారితోషికం అందుకుంటూ వచ్చింది. అయితే ఈ సినిమాకు మాత్రం ఆమె బికినీలో కనిపించినందుకుగాను మరికొంత ఎక్కువగా డిమాండ్ చేసిందట. మొత్తంగా 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. కెరీర్లోనే దీపిక పదుకొన్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. మరి పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.