స్పెయిన్‌లో దారుణ పరిస్థితుల్లో నా ప్రియుడు.. ఆందోళనలో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి, మోడల్, మిస్ ఇండియా ఇంటర్నేషన్ ఇషా గుప్తాకు సంబంధించిన డేటింగ్ వ్యవహారం కొద్దికాలంగా మీడియాలో నానుతున్నది. అయితే తన అఫైర్, డేటింగ్ వ్యవహారాన్ని బయటకు వెల్లడించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. తనకు అలాంటి రిలేషన్ లేవంటూ పలు సందర్భాల్లో ప్రశ్నలను దాటవేస్తూ వచ్చారు. కానీ తాజాగా తన ప్రియుడి గురించి చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు. అయితే కరోనా సమయంలో తన ప్రియుడు పడుతున్న కష్టాలను ఆవేదనగా చెప్పారు. ఇంతకు ఇషా గుప్తా ప్రియుడు ఎవరంటే..

కరోనా వేళ స్పెయిన్‌లో

కరోనా వేళ స్పెయిన్‌లో

కరోనా బారిన పడి దారుణంగా కష్టాలను అనుభవిస్తున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. అలాంటి దేశంలో నా ప్రియుడు కష్టాలు పడుతున్నారంటూ తాజాగా తన ప్రియుడు వివరాలను బయటపెట్టింది. మాన్యుయెల్ కాంపోస్ గుల్లార్ అనే వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నాను. ఆయన ఇప్పుడు స్పెయిన్‌లో చిక్కుకున్నారు అని ఇషా గుప్తా తన ప్రియుడు పేరును ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

ఐ లవ్ యూ అంటూ ఇన్స్‌టాలో

ఐ లవ్ యూ అంటూ ఇన్స్‌టాలో

తన ప్రియుడు మాన్యుయేల్ ఫోటోను షేర్ చేస్తూ ఐలవ్ యూ సో మచ్. మై లవ్ అంటూ మెసేజ్ పెట్టారు. హుందాగా, సూపర్‌గా సూటు, బూటు చేసుకొని ఉన్న మ్యాన్యుయేల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇషాగుప్తా షేర్ చేశారు. ఇలా తన ప్రియుడి గురించి ఇలా అఫీషియల్‌గా బయటకు చెప్పడం ఇదే మొదటిసారి.

నా ప్రియుడు విపత్కర పరిస్థితుల్లో

నా ప్రియుడు విపత్కర పరిస్థితుల్లో

నా ప్రియుడు విపత్కర పరిస్థితుల్లో చాలా కష్టాలను అనుభవిస్తూ క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతీరోజు చాలా సార్లు ఆయనతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతున్నాను. ఆయన ఆరోగ్యం గురించే నాకు ఎక్కువ బెంగగా ఉంది. ఆయన ఐసోలేషన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్న ఏదో తెలియని బాధ వెంటాడతున్నది అని ఇషా గుప్తా చెప్పారు.

Recommended Video

Eesha Rebba & Puvvada Ajay Kumar Bike Ride
బాయ్‌ఫ్రెండ్ గురించే బెంగ

బాయ్‌ఫ్రెండ్ గురించే బెంగ

మాన్యుయెల్‌ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నా కుటుంబ సభ్యులతో కలిసి నేను స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు. ఇలా లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై క్లారిటీ లేకపోవడం ఆందోళనగా మారింది అని ఇషా గుప్తా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X