అపుడు దాడి చేశాడు, ఇపుడు పరువు తీశాడు... మాజీ ప్రియుడికి హీరోయిన్ నోటీసులు!
నటి ఫ్లోరా షైనీ (ఆశా షైనీ) తన మాజీ ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషికి లీగల్ నోటీసులు పంపారు. ''ఫ్లోరా షైనీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, మీటూ ఉద్యమాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది'' అని గౌరంగ్ వ్యాఖ్యాల నేపథ్యంలో.... ఆమె ఈ లీగ నోటీసులు పంపారు.
ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో #మీటూ ఉద్యమం ఉధృతం అయిన నేపథ్యంలో పదేళ్ల క్రితం గౌరంగ్ వల్ల తాను ఎదుర్కొన్న హరాస్మెంట్ గురించి ఆమె మళ్లీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 2007లో అతడితో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న సమయంలో వాలంటైన్స్ డే సందర్భంగా తనపై తీవ్రమైన దాడి చేశాడని ప్లోరా వెల్లడించారు.

గాయాలు చూసి అంతా షాక్
ఆ దాడిలో తన మొహం చిట్లిపోయిందని, దవడ భాగానికి ఫ్యాక్చర్ అయిందని వెల్లడించడంతో పాటు గాయాలకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేశారు. ఫ్లోరా చేసిన ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్లోరాకు మద్దతుగా... గౌరంగ్ దోషి మీద #మీటూ మూమెంట్ సపోర్టర్స్ సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయ్యారు.
నేనే ఆమె చేతిలో బాధితుడిని
ఫ్లోరా షైనీ చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో గౌరంగ్ దోషి స్పందించారు.... నా వల్ల ఆమె బాధితురాలు కాలేదు, నేను ఆమె చేతిలో బాధితుడిని అంటూ అతడు వెల్లడించారు. మీటూ ఉద్యమాన్ని ఆమె తన పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని ఆరోపించారు.

ఎవరు నిజమైన బాధితులు?
ఈ సంఘటన గురించి ఫ్లోరా షైనీ లాయర్ చావ్లా సోలంకి మాట్లాడుతూ... ‘విడాకులు అయ్యాయని ఫ్లోరా షైనీతో చెప్పి ఆ సమయంలో గౌరంగ్ సహజీవనం మొదలు పెట్టాడు. కొంతకాలానికే నిజం తెలిసింది. ఈ విషయమై నిలదీసినందుకు 2007లో ఫ్లోరా మీద గౌరంగ్ తీవ్రంగా దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె మొహం, దవడ భాగంలో గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడిపై ప్లోరా కేసు పెట్టింది. అందులో ఒకటి వేధింపుల కేసు కూడా ఉంది. ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంది. కోర్టు నోటీసులు పంపినా అతడు స్పందించలేదు. ఇపుడు వారంట్ ఇష్యూ అయింది. అలాంటపుడు ఇక్కడ నిజమైన బాధితులు ఎవరు?'' అని వ్యాఖ్యానించారు.

క్షమాపణలు చెప్పాలి
నా క్లయింట్ ఫ్లోరా షైనీ మీద తప్పుడు ఆరోపణలు చేసిందుకు అతడు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఈ మేరకు అతడికి లీగల్ నోటీసులు పంపడం జరిగిందని లాయర్ సోలంకి వెల్లడించారు.
Recommended Video


తెలుగులో లక్స్ పాపగా
తెలుగులో దాదాపు 20కి పైగా చిత్రాల్లో ఆశా షైనీ( ప్లోరా స్కీన్ నేమ్) నటించారు. బాలయ్యతో చేసిన సినిమాలో ‘లక్స్ పాప లక్స్ పాప లంచికొస్తావా' అనే పాటతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన హిందీ మూవీ ‘స్త్రీ'లో ఫ్లోరా షైనీ ముఖ్యమైన పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











