For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RajKundra కేసులో గెహానా వశిష్ట్ కి సమన్లు.. మళ్ళీ అరెస్ట్?

    |

    రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆదివారం నటి గెహానా వశిష్ట్ ను పిలిపించి ముంబై పోలీసులు విచారించాలని భావించారు. అయితే తాను పట్టణానికి దూరంగా ఉన్నానని, మళ్ళీ ముంబై రాగానే పోలీసులకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని గెహానా వశిష్ట్ చెప్పారు. 'నేను ప్రస్తుతం ముంబైకి దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఈ రోజు ముంబై పోలీసుల క్రైమ్ ప్రాపర్టీ సెల్ ముందు హాజరు కాలేకపోయాను' అని గెహానా వశిష్ట్ పేర్కొన్నారు. పోర్నోగ్రఫీ ఫిల్మ్ రాకెట్ కేసు దర్యాప్తులో నేను పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. అశ్లీల చిత్రాల కేసులో గెహానా వశిష్త్ ముందే అరెస్టయ్యారు.

    ఐదు నెలల జైలులో ఉన్న తర్వాత జూన్ లో విడుదలయ్యారు. ఇక నివేదికల ప్రకారం, ఈ కేసులో ఆమె పాత్ర ఉందని, ఈ కేసులో తొమ్మిది మంది నిందితుల్లో ఆమె ఒకరని అంటున్నారు. ఆమెను మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక రాజ్ కుంద్రా ఎప్పుడూ పోర్న్ ఫిల్మ్ షూట్ చేయమని ఎవరినీ బలవంతం చేయలేదని గెహానా వశిష్ట్ చెబుతున్నారు. ఆమె ప్రకారం, రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా మాట్లాడిన పూనం పాండే మరియు షెర్లిన్ చోప్రా పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారట. ఇంకా ఆమె మాట్లాడుతూ, 'జైలుకు వెళ్లే కొద్ది రోజుల ముందు నేను రాజ్ కుంద్రా కార్యాలయానికి వెళ్లాను.

    Actress Gehana Vasisth summoned by crime branch for questioning

    అక్కడ వారు బోలీఫెమ్ అనే కొత్త యాప్‌ను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ యాప్‌లో రియాలిటీ షోలు, చాట్ షోలు, మ్యూజిక్ వీడియోలు, కామెడీ షోలు మరియు సాధారణ సినిమాలు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ ఫిలిమ్స్ లో బోల్డ్ సన్నివేశాలు ఉండవు అని పేర్కొన్నారు. ఈ సమయంలో మేము స్క్రిప్ట్ గురించి చర్చించామన్న ఆమె అప్పుడు స్క్రిప్ట్ కోసం షమితా శెట్టిని, స్క్రిప్ట్ కోసం సాయి తమంకర్ మరియు ఇద్దరు నటీనటులను కూడా తీసుకోవాలని అనుకున్నామని అన్నారు. నన్ను అరెస్టు చేయడానికి 3-4 రోజుల ముందు అతని కోసం సినిమా షూటింగ్ గురించి ఆలోచిస్తున్నానని, నేను ఈ చిత్రాలకు దర్శకత్వం వహించాల్సి ఉందని అన్నారు.

    English summary
    In the latest update in Raj Kundra's case, the crime branch has summoned three persons including actress Gehana Vasisth for questioning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X