Just In
- 30 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇబ్బందిగా అనిపించింది కానీ, తప్పదని చేశా.. ట్రాన్స్‌జెండర్‌ను కాబట్టి.. నటి హాట్ కామెంట్స్
సినిమా అన్నాక ఎలాంటి సీన్స్ అయినా చేయాల్సిందే. కొన్నిసార్లు హద్దుదాటేలా ఉంటే మాత్రం వాటిని తిరస్కరిస్తుంటారు హీరోహీరోయిన్లు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే తప్పని పరిస్థితుల్లో నటీనటులు కొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భమే ఎదుర్కొందట బాలీవుడ్ నటి ఇవాంకా దాస్. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా పేర్కొంది. వివరాల్లోకి పోతే..

ఇంతకీ ఎవరీ ఇవాంకా దాస్?
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రాన్స్‌జెండర్ కొరియోగ్రాఫర్ కమ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇవాంకా దాస్. ఇప్పుడు ఈమె నటించడం కూడా ప్రారంభించి ‘యే హై జస్ట్ మండి' అనే వెబ్ సిరీస్ ద్వారా కెమెరా ముందుకొచ్చింది. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఇవాంకా.. కెమెరా ముందు తనకు కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా అనిపించాయని ఆమె తెలిపింది.

నటి అన్నాక ఇలాంటివి తప్పదని చేశా..
తాను ఈ ‘యే హై జస్ట్ మండి' వెబ్ సిరీస్ స్టోరీ విన్నప్పుడే నటించాలని ఫిక్స్ అయ్యానని ఇవాంకా తెలిపింది. కానీ సెక్స్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా అసౌకర్యానికి గురయ్యానని చెప్పింది. తాను పర్సనల్ లైఫ్‌లో బోల్డ్‌గా ఉండొచ్చు.. కానీ ఇలాంటి సన్నివేశాల్లో మాత్రం నటించే టైప్ కాదని, బట్ నటి అన్నాక ఇలాంటివి తప్పదని తెలుసుకొని చేశానని ఇవాంకా చెప్పుకొచ్చింది.

ట్రాన్స్‌జెండర్‌ను కాబట్టి.. అవకాశం వచ్చినప్పుడు
సీమా అనే యువతి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్‌తో రాబోతోంది ‘యే హై జస్ట్ మండి' వెబ్ సిరీస్. ఇందులో తాను కరీనా అనే వేశ్య పాత్రలో కనిపిస్తానని, అయితే ఇందులో నటించడానికి తాను ఇతర నటీమణులను స్ఫూర్తిగా తీసుకోలేదని ఇవాంకా చెప్పింది. తాను ట్రాన్స్‌జెండర్‌ను కాబట్టి అలాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పుడు వేరొకరిని స్ఫూర్తిగా తీసుకోలేనని ఆమె పేర్కొంది.

ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా..
అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఇవాంకా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందట. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని మీడియా ద్వారా వెల్లడించింది ఇవాంకా దాస్.