Jacqueline Fernandez ని విచారించిన ఈడీ.. మనీలాండరింగ్ కేసుతో బాలీవుడ్‌లో ప్రకంపనలు
బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తున్నది. మనీ లాండరింగ్ కేసులో సోమవారం (ఆగస్టు 30)న జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దేశ రాజధాని ఢిల్లీలో విచారించారు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో కలకలం రేగింది. ఇంకా పలువురు బాలీవుడ్ నటులను విచారించే అవకాశం ఉందనే విషయం హిందీ సినిమా పరిశ్రమలో ప్రకంపనలు రేకెత్తాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత
బాలీవుడ్‌లో గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగు చూసిన అంశాల ఆధారంగా పెద్ద ఎత్తున్న ఈడీ అధికారులు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. విదేశీ మారకం వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాత పలువురు ఖాతాలపై ఈడీ నజర్ పెట్టి దర్యాప్తు చేపట్టింది.

యామీ గౌతమ్‌ను విచారించిన ఈడీ
మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్న ఈడీ అధికారులు ఈ ఏడాది జూలైలో బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌కు సమన్లు జారీ చేసింది. యూరీ డైరెక్టర్ ఆదిత్య ధార్‌తో పెళ్లి జరిగిన కొద్ది రోజులకే యామీ గౌతమ్ విచారణకు హాజరుకావాల్సి వచ్చింది.

తాజాగా జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఐదు గంటలపాటు
ఇలాంటి పరిస్థితుల్లో మనీ లాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలతో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను సోమవారం ఢిల్లీలో సుమారు ఐదు గంటలపాటు విచారించినట్టు తెలిసింది. అయితే జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఏ కోణంలో ప్రశ్నించారనే విషయాన్ని ఇంకా గోప్యంగానే ఉంచారు. అయితే ఆ వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఉలిక్కి పడిన బాలీవుడ్
అయితే జాక్వలైన్ ఫెర్నాండేజ్ విచారణతో బాలీవుడ్ ఉలిక్కి పడింది. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో హిందీ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులను విచారిస్తారనే వార్తలు వైరల్ కావడం దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది. జాక్వలైన్ తర్వాత ఎవరు అనే ప్రశ్న మొదలైంది.

యామీ గౌతమ్‌ను విచారిస్తారా? లేదా?
మనీలాండరింగ్ కేసులో జాక్వలైన్ ఫెర్నాడేంజ్ తర్వాత మరో బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరైన యామీ గౌతమ్‌ను మరోసారి విచారిస్తారా లేదా అనే విషయం కొద్ది రోజుల్లో స్పష్టం అవుతుందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











